తాత మధుసూధన్ కు వినతిపత్రం

తాత మధుసూధన్ కు వినతిపత్రం

1
TMedia (Telugu News) :

తాత మధుసూధన్ కు వినతిపత్రం

టీ మీడియా, మార్చి26, మధిర: జేఏసీ అధ్వర్యంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో పనిచేస్తున్న ఉద్యోగులందరిని రెగ్యులర్ చేయాలని, ఎస్ సి ఆర్ పి ఉద్యోగులకు ప్రకటించిన విధంగా తమకు కూడా ప్రభుత్వ ఉద్యోగుల తో సమానంగా వేతనాలు ఇవ్వాలని కోరుతూ ఖమ్మం జిల్లా శాసన మండలి సభ్యులు తాత మధుసూధన్ ఉపాధి హామీ లో పనిచేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగులందరూ కలిసి వినతపత్రం అందజేశారు.
ఈ ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తాత మధుసూదన్ సానుకూలంగా స్పందించి మీ సమస్యను ముఖ్య మంత్రి ,మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ద్రుష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆవుల సంతోష్ కుమార్, బొల్లేద్దు విజయ్, గద్దల భాస్కర్ దార సుధాకర్, రేలచర్ల అనిల్ కుమార్, విజయలక్ష్మి, బొడిపూడి వాణి, నాగేశ్వరరావు, సురేష్, కాంతమ్మ, లక్ష్మయ్య ఉపాధి హామీ సిబ్బంది పాల్గోన్నారు.

Also Read : కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube