పామాయిల్ పంట సాగుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహం

పామాయిల్ పంట సాగుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహం

1
TMedia (Telugu News) :

పామాయిల్ పంట సాగుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహం
ఎమ్మెల్యే అజ్మీరా రేఖ శ్యామ్ నాయక్
టీ మీడియా,మార్చి28, జన్నారం:ఒక ఎకరం వరిని సాగు చేయగలిగే నీటితో 4 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేయవచ్చుఅని,రైతులకు 50 శాతం సబ్సిడీ ఇచ్చి ఆయల్ పామ్ సాగును ప్రభుత్వం ప్రోత్సహం చేస్తుందని ఆదివారం రోజున మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే అజ్మీరా రేఖ శ్యామ్ నాయక్, ఎమ్మెల్సీ దండే విఠల్ అన్నారు. జన్నారం మండలం దేవునిగూడెం లో చెట్లను నాటిన తర్వాత ఎమ్మెల్సీ మాట్లాడుతూ నిత్యం సాగునీటి వసతి కలిగిన ప్రాంతాల్లోనే ఆయిల్ పామ్ సాగు చేయడం సాధ్యమవుతుందని, తెలంగాణ రాష్ట్రంలో పెరిగిన సాగునీటి వసతి, నిరంతర విద్యుత్ సరఫరా వల్ల ఆ సదుపాయం రాష్ట్ర రైతాంగం ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు.

Also Read : విలేకరులను పరామర్శించిన ఎంపీ, మాజీ ఎమ్మెల్యే

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ వరి వేస్తే ఉరేనని, కేంద్రం తెలంగాణ ప్రజలు పండించిన పంటను కొనుగోలు చేయడం లేదని గతంలో చెప్పిన కేసీఆర్ గారు ఈ సారి బడ్జెట్ రూపంలో పామాయిల్ పంటకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలిపారు ఇప్పటికే పామాయిల్ పంట వేస్తున్న రైతన్నలు మంచి లాభాలు ఆర్జిస్తున్నారని చెప్పారు. అందుకే తెలంగాణ రాష్ట్రంలో విస్తృతంగా పామాయిల్ పంట సాగును రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని వివరించారు. అనంతరం అదే గ్రామంలో మహీంద్రా సంఘం భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు.తదనంతరము ఆశా కార్యకర్తలకు స్మార్ట్ ఫోన్లు ను అందించి వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమాలలో మండల టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube