దహన సంస్కారాలకు ఆర్థిక సహాయం

దహన సంస్కారాలకు ఆర్థిక సహాయం

1
TMedia (Telugu News) :

దహన సంస్కారాలకు ఆర్థిక సహాయం

టీ మీడియా, మార్చి 10, వనపర్తి : వనపర్తి మండలం కడుకుంట్ల గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త విజయ్ కుమార్ అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులతో ఫోన్లో పరామర్శించి ఓదార్చారు. అనంతరం మృతుని కుటుంబానికి పదివేల రూపాయలు ఆర్థిక సహాయం తెలుగుదేశం పార్టీ నాగర్కర్నూల్ పార్లమెంట్ అధ్యక్షులు బి.రాములు, వనపర్తి మాజీ జెడ్పీటీసీ సభ్యులు ఏర్పుల వెంకటయ్య ద్వారా పంపి మృతుని భార్యకు అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మహమ్మద్ రపూప్, మహమ్మద్ ఖాజా గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Also Read : అటవీ అభివృద్ధిలో గిరిజనులకు భాగస్వామ్యం కల్పిస్తాం:రేంజర్ రెహమాన్

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube