అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నిరుపేద మహిళలకు చేయుత

అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నిరుపేద మహిళలకు చేయుత

1
TMedia (Telugu News) :

అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నిరుపేద మహిళలకు చేయుత

 

టీ మీడియా, నవంబర్ 19, గోదావరిఖని : రాయదండి గ్రామానికి చెందిన మచ్చ లక్ష్మీ అనే నిరుపేద ఒంటరి మహిళకు అమ్మ పరివార్ స్వచ్చంద సేవా సంస్థ శనివారం చేయూత అందించింది.ప్రముఖ స్త్రీ వైద్య నిపుణురాలు డాక్టర్ లక్ష్మీ వాణి జన్మదిన సందర్భంగా అమ్మ పరివార్ స్వచ్ఛంద సేవా సంస్థ వారి గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా రాయదండి గ్రామానికి చెందిన నిరుపేద మహిళ మచ్చ లక్ష్మి కి 25 కిలోల రైస్ బాగ్ తో పాటు 3000 విలువగల నిత్యవసర సరుకులను రాయదండి గ్రామ సర్పంచ్ ధర్మాజీ కృష్ణ చేతుల మీదుగా అమ్మపరివార్ నిర్వాహకులు నాగరాజు అందించారు.

Also Read : మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి వేడుకలు

ఈ సందర్భంగా నిర్వాహకులు నాగరాజు మాట్లాడుతూ… అమ్మ పరివార్ స్వచ్ఛంద సేవా సంస్థ వారి గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా కష్టాల్లో ఉన్న కుటుంబాలకు ఇలా సహాయాలు అందిస్తున్నట్టు వారు తెలిపారు.అదేవిధంగా పారిశ్రామిక ప్రాంతంలో ఎన్నో సేవలందిస్తూ ఎందరికో తన సేవలను అందిస్తూ పేదవారికి ఎంతో సహాయం చేస్తున్న డాక్టర్ లక్ష్మీవాని ఇలాంటి సంతోషకరమైన జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు.ఇంకా ఈ కార్యక్రమంలో అమ్మ పరివార్ సంస్థ సభ్యులు,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube