దివ్యాంగుల స్వయం ఉపాధి కి ప్రభుత్వం చేయూతనివ్వాలి

దివ్యాంగుల స్వయం ఉపాధి కి ప్రభుత్వం చేయూతనివ్వాలి

2
TMedia (Telugu News) :

దివ్యాంగుల స్వయం ఉపాధి కి ప్రభుత్వం చేయూతనివ్వాలి
టి మీడియా,మార్చి11,రామకృష్ణా పూర్:దివ్యాంగుల స్వయం ఉపాధి కి ప్రభుత్వం చేయుతనివ్వాలని అమ్మ వికలాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు రవి డిమాండ్ చేశాడు. శుక్రవారం రాజీవ్ చౌక్ లో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.బడ్జెట్ లో వికలాంగుల సంక్షేమానికి 5 శాతం నిధులు కేటాయించడం విస్మరించిందని మండి అసహనాన్ని వ్యక్తం చేశారు.2016 దివ్యాంగుల హక్కుల పరి రక్షణ చట్టం ప్రకారం 21 రకాల వైకల్యాలను గుర్తించందని,తెలంగాణ ప్రభుత్వం 2022-23 ఆర్ధిక బడ్జెట్ ను సవరించి స్వయం ఉపాధి కల్పనకు ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల ను కేటాయించాలని కోరారు.ఈ కార్యక్రమంలో అమ్మ వికలాంగుల సంక్షేమ సంఘం నాయకులు అజీజ్ పాషా,కార్య దర్శులు శ్రీనివాస్ రెడ్డి,చందర్ లు పాల్గొన్నారు.

Also Read : హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతి పొందిన సిబ్బందికి సన్మానం

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube