సబ్బు పెట్టెల్లో రూ.5 కోట్ల విలువైన హెరాయిన్‌

సబ్బు పెట్టెల్లో రూ.5 కోట్ల విలువైన హెరాయిన్‌

1
TMedia (Telugu News) :

సబ్బు పెట్టెల్లో రూ.5 కోట్ల విలువైన హెరాయిన్‌

టీ మీడియా, నవంబర్ 2, కరీంగంజ్‌ : అసోంలో పెద్దమొత్తంలో హెరాయిన్‌ పట్టుబడింది. మత్తు మందును సబ్బు పెట్టెల్లో రహస్యంగా తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. హెరాయిన్‌ను తరలిస్తున్నారనే విశ్వసనీయమైన సమాచారంతో కరీంగంజ్‌లోని అశీమ్‌గంగ్‌ ప్రాంతంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో అశీమ్‌గంజ్‌ సమీపంలో వాహనాలను తనిఖీ చేస్తుండగా.. ఓ వ్యాన్‌ను పోలీసులు ఆపారు. దీంతో డ్రైవర్‌ వ్యాన్‌ను అక్కడే వదిలేసి పారిపోయాడు. దీంతో అందులో తనిఖీ చేయగా సబ్బు పెట్టెల్లో రహస్యంగా తరలిస్తున్న 676 గ్రాముల హెరాయిన్‌ గుర్తించారు.

Also Read : సీఎం హేమంత్‌ సోరెన్‌కు ఈడీ సమన్లు

వ్యాన్‌లో ఉన్న సబ్బుల పెట్టెలతో కూడిన 52 కేసులను పోలీసులు సీజ్‌ చేశారు. బహిరంగా మార్కెట్‌లో దాని విలువ రూ.5 కోట్లు ఉంటుందని చెప్పారు. ఆ వాహనం మిజోరం నుంచి పతార్‌కండీకి వెళ్తున్నదని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసునమోదుచేసి దర్యాప్తు ప్రారంభించామన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube