తెలంగాణ లో కుండ పోత వర్షాలు

ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు

1
TMedia (Telugu News) :

తెలంగాణ లో కుండ పోత వర్షాలు

ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

నల్గొండ, యాదాద్రి, సూర్యాపేట, సంగారెడ్డి, వికారాబాద్, మెదక్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈజిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు ఇచ్చారు. మంచిర్యాల, ఆసిఫాబాద్, కరీంనగర్, భూపాలపల్లి, పెద్దపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉండనుంది.

also read :అబార్షన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

 

వరంగల్, మహబూబాబాద్, హన్మకొండ, సిద్దిపేట, జనగామ, రంగారెడ్డి, హైదరాబాద్, కామారెడ్డి, మేడ్చల్, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూలు, నారాయణపేట, వనపర్తి, జోగులాంట గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడనున్నాయి. పై జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు. రేపు(శుక్రవారం) రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. ఎల్లుండి(శనివారం) రంగారెడ్డి, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి.

నాగర్ కర్నూలు, నారాయణపేట, జోగులాంబ గద్వాల, వనపర్తి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. ఈమేరకు హైదరాబాద్ వాతావరణ శాఖ ..వెదర్ రిపోర్ట్‌ను ప్రకటించింది. మరోవైపు బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. నిన్న ఆంధ్రప్రదేశ్‌ తీరంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా కేంద్రీకృతమైన ఉపరితల ఆవర్తనం ఇవాళ అదే ప్రాంతంలో సగటు సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది.

also read :శంకుస్ధాపనలు, ప్రారంబోత్యవాలు చేసిన మంత్రి పువ్వాడ

ఇటు తూర్పు పడమర ద్రోణి..ఉత్తర అండమాన్ సముద్రం నుంచి ఏపీ తీరం వరకు కేంద్రీకృతమైంది. ఇవాళ తూర్పు పడమర ద్రోణి.. తూర్పు మధ్య బంగాళాఖాతం నుంచి రాయలసీమ వరకు సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. అక్టోబర్ 1 నాటికి ఈశాన్య, పరిసర తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. వీటి ప్రభావంతో తెలంగాణవ్యాప్తంగా జోరు వర్షాలు కురుస్తున్నాయి.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube