మూడు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు

మూడు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు

0
TMedia (Telugu News) :

హైదరాబాద్‌: తెలంగాణలో రానున్న మూడు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలతోపాటు గంటకు 30 నుంచి 40కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ కేంద్ర సంచాలకులు డాక్టర్‌ నాగరత్న ఓ ప్రకటనలో తెలిపారు. వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం అదే ప్రదేశంలో కొనసాగుతుందన్నారు. ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుంచి మధ్య ట్రోపోస్పిరిక్‌ స్థాయి వరకు విస్తరించి ఉందని.. ఇది రానున్న 24 గంటల్లో వాయుగుండంగా బలపడి దక్షిణ ఒడిశా-ఉత్తర ఆంధ్రప్రదేశ్‌ తీరాలకు

దగ్గరలోని వాయవ్య దిశగా ఉన్ పశ్చిమ మధ్య బంగాళాఖాతం తీరానికి చేరుకునే అవకాశం ఉందని వివరించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube