తిరుమ‌ల శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న ‘హాయ్‌ నాన్న’ టీమ్

తిరుమ‌ల శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న ‘హాయ్‌ నాన్న’ టీమ్

0
TMedia (Telugu News) :

తిరుమ‌ల శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న ‘హాయ్‌ నాన్న’ టీమ్

టీ మీడియా, డిసెంబర్ 4, తిరుమ‌ల : టాలీవుడ్ న్యాచురల్‌ స్టార్ నాని హీరోగా న‌టిస్తున్న తాజా చిత్రం ‘హాయ్‌ నాన్న’. నాని 30 గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు శౌర్యువ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ సినిమా డిసెంబరు 7న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న విష‌యం తెలిసిందే. తెలుగుతో పాటు త‌మిళం, క‌న్న‌డ‌, హిందీ, మ‌ల‌యాళ భాష‌ల్లో గ్రాండ్‌గా విడుద‌ల కానుంది. అయితే విడుద‌ల తేదీ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా సోమవారం తిరుప‌తి వెళ్లిన ‘హాయ్‌ నాన్న టీమ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు నానికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం గర్భాలయంలో స్వామివారిని ఆయన దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆయనకు వేదాశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

Also Read : కాజీపేట- విజయవాడ మార్గంలో పలు రైళ్లు రద్దు

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube