శ్రీవారిని దర్శించుకున్న ఏపీ, తెలంగాణ హైకోర్టు జస్టిస్‌లు

శ్రీవారిని దర్శించుకున్న ఏపీ, తెలంగాణ హైకోర్టు జస్టిస్‌లు

1
TMedia (Telugu News) :

శ్రీవారిని దర్శించుకున్న ఏపీ, తెలంగాణ హైకోర్టు జస్టిస్‌లు
టీ మీయాడి,సెప్టెంబర్ 4,తిరుమల : తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకునేందుకు భక్తుల రద్దీ కొనసాగుతుంది . శ్రీవారి సర్వదర్శనానికి 10 కంపార్టుమెంట్లలో భక్తులు వేచియున్నారు. వీరికి 10 గంటల్లో దర్శనం కలుగు తుందని టీటీడీ వర్గాలు తెలిపాయి. నిన్న స్వామివారిని 79,833 మంది భక్తులు దర్శించుకోగా 36,074 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.

Also Read : రక్తదానం చేయడం చిన్నవిషయం కాదు

భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ.4.73 కోట్లు వచ్చిందని పేర్కొన్నారు.ఇవాళ తెల్లవారుజామున ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వెంకటరమణ, జస్టిస్‌ కృపాసాగర్‌, తెలంగాణ న్యాయమూర్తి జస్టిస్‌ నాగేశ్‌ భీమపాక స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికారు. దర్శనం అనంతరం అర్చకులు ఆశీర్వచనాలు , తీర్థప్రసాదాలు అందించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube