కేసీఆర్ కు హైకోర్టు నోటీసులు

కేసీఆర్ కు హైకోర్టు నోటీసులు

1
TMedia (Telugu News) :

కేసీఆర్ కు హైకోర్టు నోటీసులు

టి మీడియా,జూన్ 24,హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావుకు హైకోర్టు నోటీసులు జారీ చేసిం‍ది. భూముల వ్యవహారంలో సీఎం కేసీఆర్‌తో అధికారులు, కలెకర్టర్‌కు సైతం రాష్ట్ర అ‍త్యున్నత న్యాయస్థానం నుంచి నోటీసులు వెళ్లాయి.

Also Read : మంత్రి మల్లారెడ్డి చేతుల మీదుగా ఇండ్ల పట్టాల పంపిణీ

వివరాల ప్రకారం.. తెలంగాణలోని పలు జిల్లాలో టీఆర్‌ఎస్‌ కార్యాలయాలకు గాను భూమి కేటాయింపులు జరిగాయి. ఇందులో భాగంగా.. హైదరాబాద్‌ కార్యాలయం కోసం బంజారాహిల్స్​లో 4,935 గజాలు కేటాయించారు. కాగా, ఎంతో విలువ చేసే గజం భూమిని రూ. 100కే (గజం చొప్పున) కేటాయించినట్టు రిటైర్డ్‌ ఉద్యోగి మహేశ్వర్‌రాజ్‌.. హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు పిటిషన్‌ దాఖలు చేశారు.

Also Read : ఎలాంటి అభివృద్ధి జరగడం లేదు

ఈ నేపథ్యంలో, పిటిషన్‌పై హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. విచారణ అనంతరం హైకోర్టు.. సీఎం కేసీఆర్‌, పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డితో పాటు సీఎస్‌, సీసీఎల్‌ఏ, హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ ఉన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులపై నాలుగు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని అత్యున్నత నాయ్యస్థానం ఆదేశించింది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube