ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలి

0
TMedia (Telugu News) :

టీ మీడియా డిసెంబర్ 13 వనపర్తి : మందకృష్ణ మాదిగ పిలుపుమేరకు మాదిగ మరియు ఉప కులాలకు జనాభా ప్రతిపాదికన రిజర్వేషన్ల కొరకు 27 సంవత్సరాలుగా జరుగుతున్న సామాజిక న్యాయ పోరాటానికి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం (డిసెంబర్ 14)ఢిల్లీలో జరిగే మాదిగ విద్యార్థుల జాతీయ మహాసభ కు తరలి వెళ్లాలని దేవరకద్ర నియోజకవర్గ ఎంఎస్ఎఫ్ మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ విద్యార్థులు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో తీర్మానం చేసి తెలంగాణలోని మాదిగ మరియు ఉప కులాలను నిలువునా మోసం చేసి గద్దెనెక్కి మౌనంగా ఉన్నాడు. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వర్గీకరణ ఊసే ఎత్తడం లేదు ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పార్టీ మొదటి నుండి వర్గీకరణ మేము అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో వర్గీకరణ చేస్తామని ప్రకటించి ఏడు సంవత్సరాలు గడిచింది.

కానీ పార్లమెంట్ ద్వారా చట్టబద్ధత కల్పిస్తామన హామీని మరిచిన కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసేందుకు మాదిగ విద్యార్థుల ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగే చలో ఢిల్లీ జాతీయ మహాసభను ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం ఎస్సీ కులాలను ఏబిసిడి లు వర్గీకరణను గుర్తు చేయడానికి వెళుతున్న ఎంఎస్ఎఫ్ విద్యార్థులకు సామాజిక కోణంతో మద్దతుగా ఆర్థిక మరియు సహాయ సహకారాలు అందించిన విద్యాసంస్థలకు మరియు వివిధ రాజకీయ పార్టీ నాయకులకు ముఖ్యంగా ఎంఈఎఫ్ విభాగానికి నాయకత్వం వహిస్తున్న పెద్దలు గద్వాల కృష్ణకి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube