కిలో ఉల్లిగడ్డ ధర రూ. 220, కిలో చికెన్ రూ. 383
టీ మీడియా, జనవరి 11, న్యూఢిల్లీ : పాకిస్తాన్ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. ఆహార ధరలు ఆకాశాన్నంటాయి. రోజు తినే చపాతీల కోసం వినియోగించే గోధుమ పిండి కోసం స్థానిక ప్రజలు కొట్టుకుంటున్నారు. గోధుమ పిండి సరఫరా చేసే లారీలపై దాడులు చేస్తున్నారు. పిండి పంపిణీ చేసే డీలర్ షాపుల వద్ద తీవ్రమైన ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. ఇక ఉల్లిగడ్డ, చికెన్, పప్పులు, ఉప్పు, బస్మాతి రైస్, ఆవ నూనె, బ్రెడ్, మిల్క్ ధరలతో పాటు అరటి పండ్ల ధరలు ఆకాశాన్నంటాయి. కిలో ఉల్లిగడ్డ ధర రూ. 220.4 కేజీలు ఉండగా, కిలో చికెన్ ధర రూ. 383గా ఉంది. డజన్ అరటి పండ్ల ధర రూ. 119. లీటర్ మిల్క్ రూ. 150గా ఉంది. ఈ నిత్యావసరాల ధరలు భారీగా పెరగడంతో పేద, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Also Read : ప్రైవేటు బస్సులపై ఆర్టీఏ కొరఢా.. హైవేపై తనిఖీలు
పెట్రోల్, డిజీల్ ధరలు కూడా అమాంతం పెరిగాయి. పెట్రోల్ ధర 48 శాతం పెరిగింది.కరాచీలో కిలో పిండి రూ.160కి అమ్ముతున్నారు. ఇస్లామాబాద్, పెషావర్ నగరాల్లో 10 కిలోల బ్యాగ్‌ను రూ.1500కు అమ్ముతున్నారు.పంజాబ్ ప్రావిన్సులోని మిల్లు ఓనర్లు గోధమ బ్యాగ్ ధరలను విపరీతంగా పెంచేశారు. అయినా గోధుమ బ్యాగులు ఎక్కడా స్టాక్ లేనట్లు తెలుస్తోంది.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube