మేలైన విత్తనాలతో అధిక దిగుబడులు

సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ రుక్మిణిదేవి

1
TMedia (Telugu News) :

మేలైన విత్తనాలతో అధిక దిగుబడులు

సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ రుక్మిణిదేవి

టీ మీడియా, మే25 మధిర:

రైతులు మేలైన విత్తనాలను నాటి అధిక దిగుబడులను సాధించి ఆర్థిక అభివృద్ధి పొందాలని మదిర వ్యవసాయ పరిశోధన స్థానం హెడ్ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కే రుక్మిణీదేవి పేర్కొన్నారు. మంగళవారం స్థానిక వ్యవసాయ పరిశోధన స్థానం లో విత్తన మేళ 2022 నిర్వహించారు. ఈ విత్తన మేళాలో మదిర వ్యవసాయ పరిశోధన స్థానంలో రూపొందించిన పెసర, కంది, మినుము విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పరిశోధనా స్థానంలో రూపొందించిన విత్తనాల యొక్క ప్రాముఖ్యత వాటి గుణగణాల గురించి రైతులకు అవగాహన కల్పించారు.

Also Read:అరుదైన కలయిక దావోస్‌ వేదికగా సీఎం జగన్‌తో కేటీఆర్‌ భేటీ

వచ్చే వర్షాకాలం సీజన్ లో పంటలకు ఆశించే చీడపీడలు వాటి నివారణకు తీసుకోవలసిన చర్యల గురించి శాస్త్రవేత్త కె నాగస్వాతి వివరించారు విత్తనం తో పాటు భూమి సారవంతం పెంపొందించడం పాస్పరస్ ను కరిగించే బ్యాక్టీరియా వినియోగంపై డాక్టర్ జి వేణుగోపాల్ రైతులకు అవగాహన కల్పించారు మట్టి నమూనా సేంద్రియ ఎరువుల వినియోగం పై కోరమండల్ కంపెనీ ప్రతినిధి ఏ రామకృష్ణ వివరించారు.

Also Read:డిప్యూటీ మేయర్ఆకస్మిక పర్యటన

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube