మంత్రి పువ్వాడకు హై కోర్టు నోటీసులు

సాయి గణేష్ ఆత్మహత్య కేసు గురించి

1
TMedia (Telugu News) :

మంత్రి పువ్వాడకు హై కోర్టు నోటీసులు
-సాయి గణేష్ ఆత్మహత్య కేసు గురించి
టి మీడియా,ఎప్రిల్ 22,హైదరాబాద్‌: ఖమ్మంలో ఆత్మహత్య చేసుకున్న సాయిగణేష్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుపై దాఖలైన ఓ పిటిషన్‌పై స్పందించిన తెలంగాణ హైకోర్టు.. మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌కు శుక్రవారం నోటీసులు జారీ చేసింది.

అంతేకాదు.. ఈ వ్వవహారంలో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ గడువిచ్చింది ఉన్నత న్యాయస్థానం. మంత్రి పువ్వాడతో పాటు మొత్తం ఎనిమిది మంది ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది హైకోర్టు. ఆపై విచారణను ఏప్రిల్‌ 29వ తేదీకి వాయిదా వేసింది.

Also Read : టాలెంట్ విజేతలకు బహుమతులు ప్రధానం

ఇదిలా ఉండగా.. పోలీసుల వేధింపుల తాళలేక సాయి గణేష్ ఆత్మహత్య చేసున్నాడని పిటిషనర్ తరపు న్యాయవాది అభినవ్ వాదించారు. ఈ కేసును సీబీఐతో ప్రత్యేక దర్యాప్తు చేయించాలని కోరారు. అయితే.. సాయి గణేష్ ఆత్మహత్య పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్న అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్.. అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నామని తెలిపారు. కొంత సమయం ఇస్తే పూర్తి వివరాల తో కౌంటర్ ధాఖలు చేస్తామని ఏజీ తెలపగా.. తదుపరి విచారణను ఏప్రిల్ 29 కి వాయిదా వేసింది హైకోర్టు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube