బిజేపికి రూ.614.53కోట్ల అత్య‌ధిక‌ విరాళాలు

-రెండ‌వ‌స్థానంలో కాంగ్రెస్

1
TMedia (Telugu News) :

బిజేపికి రూ.614.53కోట్ల అత్య‌ధిక‌ విరాళాలు

-రెండ‌వ‌స్థానంలో కాంగ్రెస్

టీ మీడియా, నవంబర్ 30, న్యూఢిల్లీ: కేంద్రంతో పాటు ప‌లు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బిజెపి ఖ‌జానాలో కోట్ల రూపాయ‌లు జ‌మ అవుతున్నాయ‌ట‌.. గడిచిన ఏడాదిలో బీజేపీకి రూ.614.53 కోట్ల రూపాయల విరాళాలు స‌మ‌కూరాయి. ఇదే సమయంలో ప్రతిపక్ష కాంగ్రెస్ కు వచ్చిన విరాళాలకంటే ఆరు రెట్లు ఎక్కువ కావడం గమనార్హం. కాంగ్రెస్ రూ.95.46 కోట్ల విరాళాలతో రెండో స్థానంలో ఉంది. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ రూ.44.54 కోట్ల విరాళాలతో మూడో స్థానంలో నిలిచింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీతో పాటు పంజాబ్ లో అధికారంలో ఉంది.బీజేపీ, కాంగ్రెస్ సహా జాతీయ పార్టీలు తమకు వచ్చిన విరాళాల గురించిన సమాచారాన్ని ఎన్నికల సంఘానికి సమర్పించాయి. ఈ వివరాల ప్రకారం దేశంలో 2021-22కు గాను బీజేపీకే అత్యధికంగా విరాళాలు వచ్చాయి.

Also Read : లంచం తీసుకుంటూ పట్టుబడ్డ పంచాయతీ కార్యదర్శి

ఇదే కాలానికిగాను మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి రూ.43 లక్షలు మాత్రమే వచ్చాయి. కేరళలో అధికారంలోఉన్న సీపీఎం రూ.10 కోట్లు విరాళంగా పొందింది. గతేడాది పశ్చిమ బెంగాల్ తో పాటు కేరళ అసెంబ్లీకి గతేడాది ఎన్నికలు జరిగాయి. నిబంధనల ప్రకారం రూ.20 వేల కంటే ఎక్కువ మొత్తం విరాళాలుగా వస్తే వాటి వివరాలను ఎన్నికల సంఘానికి సమర్పించాలి.పాటు ప‌లు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బిజెపి ఖ‌జానాలో కోట్ల రూపాయ‌లు జ‌మ అవుతున్నాయ‌ట‌.. గడిచిన ఏడాదిలో బీజేపీకి రూ.614.53 కోట్ల రూపాయల విరాళాలు స‌మ‌కూరాయి. ఇదే సమయంలో ప్రతిపక్ష కాంగ్రెస్ కు వచ్చిన విరాళాలకంటే ఆరు రెట్లు ఎక్కువ కావడం గమనార్హం. కాంగ్రెస్ రూ.95.46 కోట్ల విరాళాలతో రెండో స్థానంలో ఉంది. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ రూ.44.54 కోట్ల విరాళాలతో మూడో స్థానంలో నిలిచింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీతో పాటు పంజాబ్ లో అధికారంలో ఉంది. బీజేపీ, కాంగ్రెస్ సహా జాతీయ పార్టీలు తమకు వచ్చిన విరాళాల గురించిన సమాచారాన్ని ఎన్నికల సంఘానికి సమర్పించాయి.

ఈ వివరాల ప్రకారం దేశంలో 2021-22కు గాను బీజేపీకే అత్యధికంగా విరాళాలు వచ్చాయి. ఇదే కాలానికిగాను మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి రూ.43 లక్షలు మాత్రమే వచ్చాయి. కేరళలో అధికారంలోఉన్న సీపీఎం రూ.10 కోట్లు విరాళంగా పొందింది. గతేడాది పశ్చిమ బెంగాల్ తో పాటు కేరళ అసెంబ్లీకి గతేడాది ఎన్నికలు జరిగాయి. నిబంధనల ప్రకారం రూ.20 వేల కంటే ఎక్కువ మొత్తం విరాళాలుగా వస్తే వాటి వివరాలను ఎన్నికల సంఘానికి సమర్పించాలి.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube