ఓయూలో రాహుల్‌ పర్యటనకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

150 మందితో మాత్రమే ముఖాముఖి

2
TMedia (Telugu News) :

ఓయూలో రాహుల్‌ పర్యటనకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

-150 మందితో మాత్రమే ముఖాముఖి
టీ మీడియా, మే 5, హైదరాబాద్‌: ఉస్మానియా యూనివర్సిటీలో రాహుల్‌ గాంధీ పర్యటనకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. రాహుల్‌ను అనుమతించాలంటూ ఓయూ వీసీనీ హైకోర్టు ఆదేశించింది. 150 మందితో మాత్రమే ముఖాముఖికి అనుమతించాలని వీసీకి ఆదేశాలు జారీ చేసింది. కాగా మే 6న రాహుల్‌ గాంధీ తెలంగాణకు రానున్నారు. షెడ్యూల్‌ ప్రకారం 6వ తేదీన రాహుల్‌ హన్మకొండలోని ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో ఏర్పాటు చేయనున్న రైతు సంఘర్షణ సభలో రాహుల్‌ పాల్గొననున్నారు. మే7న ఓయూ విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. రాష్ట్రంలో రాజకీయమంతా రాహుల్‌గాంధీ చుట్టూనే తిరుగుతోంది.

Also Read : ఎస్సై కి అభినందనలు…

ఈ నెల 6,7 తేదీల్లో రాహుల్‌ రాష్ట్ర పర్యటన ఖరారు కావడం, ఆయన్ను ఉస్మానియా యూనివర్సిటీకి తీసుకురావాలంటూ విద్యార్థి సంఘాల నేతలు రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకత్వాన్ని కోరడం తెలిసిందే. అందుకు టీపీసీసీ అనుమతించి షెడ్యూల్‌లో ఓయూ సందర్శనను చేర్చడం, ఈ మేరకు ఓయూ వీసీని అనుమతి కోరడమూ తెలిసిందే.వర్సిటీ వర్గాలు నిరాకరించడంతో మొదలైన వివాదం రోజురోజుకూ వేడెక్కుతూ గత ఆరు రోజులుగా కొనసాగుతూనే ఉంది. నిరసనలు, దిష్టిబొమ్మల దహనాలు, అరెస్టులతో ఓయూ ప్రాంగణంలో ఉద్రిక్తత నెలకొంది. ఈ విషయమై తెలంగాణ కాంగ్రెస్‌.. హైకోర్టును ఆశ్రయించగా ప్రస్తుతం కోర్టు రాహుల్‌ ఓయూ పర్యటనకు అనుమతిచ్చింది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube