రహదారుల విస్తరణ పనులు వేగవంతం చేయాలి 

జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్

1
TMedia (Telugu News) :

రహదారుల విస్తరణ పనులు వేగవంతం చేయాలి

జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్

టి మీడియా, జూన్, 21 ఖమ్మం:నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాచే ఖమ్మం జిల్లాలో చేపడుతున్న రహదారుల విస్తరణ పనులు వేగవంతం చేసి, నిర్ణీత గడువులోగా పూర్తిచేసేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో అధికారులతో పనుల ప్రగతిపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విస్తరణ పనులకు ఆటంకం కలగకుండా భూ సేకరణ, నష్టపరిహారం చెల్లింపు ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. సుమారు రూ. 1566 కోట్లతో చేపడుతున్న సూర్యాపేట – ఖమ్మం విభాగం నాలుగు వరుసల జాతీయ రహదారి పనులు 85 శాతం పూర్తయినట్లు, మిగతా పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. సుమారు రూ.1039 కోట్లతో చేపడుతున్న కోదాడ – ఖమ్మం విభాగం నాలుగు వరుసల జాతీయ రహదారి పనులు 15 శాతం పూర్తయినట్లు, ఇట్టి పనులు జనవరి, 2022లో ప్రారంభించగా, 24 నెలల్లో పూర్తి చేయాల్సి ఉందన్నారు.

 

Also Read : ఎస్.బి. ఐ.టి.లో ప్రాంగణ నియామకాలు

 

ఖమ్మం- దేవరపల్లి నాలుగు లైన్ల రహదారి ప్యాకేజి -1, ప్యాకేజి-2, ప్యాకేజి-3 పనుల కొరకు అవార్డు చేయబడినట్లు, వచ్చే నెలలో పనులు ప్రారంభం కానున్నట్లు ఆయన అన్నారు. ఖమ్మం- దేవరపల్లి నాలుగు వరుసల జాతీయ రహదారి గ్రీన్ ఫీల్డ్ గా చేయుటకు నిర్ణయించి ఉత్తర్వులు జారీచేయబడినట్లు కలెక్టర్ తెలిపారు. భూ సేకరణలో నిర్మాణాలు అన్నిటిని సర్వే చేసి పరిహారం అందజేతకు చర్యలు చేపట్టాలన్నారు. ఇండ్ల వారిగా కట్టడాలు, టాయిలెట్లు, ప్రహారీ గోడలు తదితరాలన్నీ పరిగణలోకి తీసుకోవాలన్నారు. రహదారి పనులకు ఏలాంటి ఆటంకాలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలన్నారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రెవిన్యూ ఎన్. మధుసూదన్, ఆర్డివోలు రవీంద్రనాద్, సూర్యనారాయణ, నేషనల్ హైవే ప్రాజెక్ట్ డైరెక్టర్ దుర్గాప్రసాద్, ఏడి సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ రాములు, నేషనల్ హైవే మేనేజర్లు పద్మ, దివ్య, తహసిల్దార్లు అధికారులు, తదితరులు పాల్గొన్నారు,

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube