హిజాబ్ వివాదంపై క‌ర్నాట‌క హైకోర్టు సంచ‌ల‌న తీర్పు

హిజాబ్ వివాదంపై క‌ర్నాట‌క హైకోర్టు సంచ‌ల‌న తీర్పు

1
TMedia (Telugu News) :

హిజాబ్ వివాదంపై క‌ర్నాట‌క హైకోర్టు సంచ‌ల‌న తీర్పు

టీ మీడియా,మార్చి 15,బెంగుళూరు: హిజాబ్ వివాదంపై క‌ర్నాట‌క హై కోర్టు ఇవాళ సంచ‌ల‌న తీర్పును వెలువ‌రించింది. విద్యా సంస్థ‌ల్లో హిజాబ్‌ను బ్యాన్ చేయాల‌ని దాఖ‌లైన ప‌లు పిటీష‌న్ల‌ల‌ను కొట్టి పారేసింది. అయితే స్కూళ్ల‌లో హిజాబ్ ధ‌రించ‌డం త‌ప్ప‌నిస‌రి కాదు అని కోర్టు తెలిపింది. ఇటీవ‌ల ఉడిపి కాలేజీలో ఆరుగురు అమ్మాయిలు హిజాబ్ ధ‌రించ‌డం వ‌ల్ల వివాదం ముదిరిన విష‌యం తెలిసిందే. ఆ జిల్లాలో ఇవాళ స్కూళ్లు, కాలేజీల‌కు సెల‌వు ప్ర‌క‌టించారు. హిజాబ్ ధార‌ణ ఇస్లాం మ‌తంలో త‌ప్ప‌నిస‌రి ఆచార‌మేమీ కాదు అని ఇవాళ కోర్టు చెప్పింది.విద్యాసంస్థ‌ల్లో హిజాబ్ బ్యాన్ అంశంపై ఇవాళ త్రిస‌భ్య ధ‌ర్మాస‌నం విచార‌ణ చేప‌ట్టింది. విద్యాసంస్థల్లో హిజాబ్‌పై విధించిన బ్యాన్‌ను కోర్టు స‌మ‌ర్థించింది. యూనిఫామ్‌ను ధ‌రించ‌డ‌మ‌నేది ఫ్రాథ‌మిక హ‌క్కుల‌కు భంగం కాదు అని, కేవ‌లం ఆంక్ష మాత్ర‌మే అవుతుంద‌ని కోర్టు తెలిపింది. జ‌స్టిస్ రీతు రాజ్ అవాస్తీ ఇవాళ కోర్టు తీర్పును వెలువ‌రించారు. ఫిబ్ర‌వ‌రి 5వ తేదీని జారీ చేసిన ప్ర‌భుత్వ జీవోను నిర్వీర్యం చేయ‌డంలేద‌ని కోర్టు చెప్పింది.

Also Read : సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube