ప్ర‌పంచంలోనే అత్యంత ఎత్తులో హిమాచ‌ల్ పోలింగ్ స్టేష‌న్‌

ప్ర‌పంచంలోనే అత్యంత ఎత్తులో హిమాచ‌ల్ పోలింగ్ స్టేష‌న్‌

1
TMedia (Telugu News) :

ప్ర‌పంచంలోనే అత్యంత ఎత్తులో హిమాచ‌ల్ పోలింగ్ స్టేష‌న్‌

టీ మీడియా, నవంబర్ 12,షిమ్లా : హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో అత్యంత ఎత్తైన ప్ర‌దేశంలో పోలింగ్ స్టేష‌న్‌ను ఏర్పాటు చేశారు. తాషిగ్యాంగ్, స్పిటిలో ఆ పోలింగ్ స్టేష‌న్‌ను ఏర్పాటు చేశారు. ఇది 15,256 అడుగుల ఎత్తులో ఉంది. ప్ర‌పంచంలోనే అత్యంత ఎత్తైన ప్ర‌దేశంలో ఉన్న పోలింగ్ బూత్‌గా రికార్డు క్రియేట్ చేశారు. ఇవాళ హిమాచ‌ల్‌లో అసెంబ్లీ ఎ న్నిక‌లు జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. ఆ పోలింగ్ కోసం రాష్ట్ర‌వ్యాప్తంగా 7,884 పోలింగ్ స్టేష‌న్ల‌ను ఏర్పాటు చేశారు. కొండ ప్రాంతాల వాళ్ల కోసం కూడా ప్ర‌త్యేకంగా పోలింగ్ బూత్‌ల‌ను ఏర్పాటు చేశారు.

Also Read : విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత

అత్యంత ఎత్తులో ఉన్న తాషిగ్యాంగ్ బూత్‌లో మొత్తం 52 మంది ఓట‌ర్లు ఓటు వేయ‌నున్నారు. సీనియ‌ర్ సిటిజ‌న్లు, దివ్యాంగ ఓట‌ర్ల కోసం ఆ బూత్‌ను మోడ‌ల్ పోలింగ్ స్టేష‌న్‌గా మార్చారు. హిమాచ‌ల్‌లో మొత్తం 68 నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. డిసెంబ‌ర్ 8వ తేదీన ఫ‌లితాల‌ను వెల్ల‌డించ‌నున్నారు. ఇవాళ ఉద‌యం 11 గంట‌ల వ‌ర‌కు 17.98% పోలింగ్ జ‌రిగిన‌ట్లు అధికారులు తెలిపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube