టోర్నమెంట్‌కు ఎంపికైన హాకీ క్రీడాకారుడు

0
TMedia (Telugu News) :

టీ మీడియా డిసెంబర్ 8 వనపర్తి : ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర స్థాయి హాకీ క్యాంపులో అత్యున్నత ప్రతిభ కనబరిచిన ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నుంచి జాతీయ సీనియర్ మేన్స్ హాకీ టోర్నమెంట్‌కి వనపర్తి జిల్లా క్రీడాకారుడు ఆదిత్య సాగర్ ఎంపికయ్యారు. ఈ నెల 11 నుంచి 22వ తేదీ వరకు మహారాష్ట్ర పూణే లో నిర్వహించే పదకొండవ సీనియర్ మేన్స్ హాకీ టోర్నమెంట్లో తెలంగాణ రాష్ట్ర జట్టు తరఫున పాల్గొనడం జరుగుతుందని వనపర్తి జిల్లా హాకీ సెక్రెటరీ బొలమోని కుమార్ తెలిపారు. వనపర్తి జిల్లా నుంచి జాతీయ స్థాయి సీనియర్ మేన్స్ టోర్నమెంట్‌కు క్రీడాకారులు ఆదిత్యం ఇవ్వడం జిల్లా ప్రజలు క్రీడాకారులు గర్వించదగ్గ విషయమని హాకీ క్రీడాకారుడు ఆదిత్య సాగర్ ని వనపర్తి జిల్లా హాకీ ప్రెసిడెంట్ పగిడాల శ్రీనివాస్, మహబూబ్‌నగర్ జిల్లా సెక్రటరీ శ్రీనివాస్ గౌడ్ ,గద్వాల సెక్రెటరీ ఆనంద్ ,నాగర్‌కర్నూల్ జిల్లా సెక్రెటరీ రమేష్ బాబు, వనపర్తి జిల్లా కోశాధికారి మన్యం అసోసియేషన్ సభ్యులు దయానంద్ క్రీడాకారులు అభినందించారు.

Hockey player selected for the tournament
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube