హోల్డ్ లోమాజీ మంత్రి తుమ్మల నిర్ణయం
– కే సి ఆర్ కాల్ కోసం ఎదురు చూపు
– రెండు వారాల అనంతరం నిర్ణయం
– కాంగ్రెస్ ,బిజెపి నుండి ఆహ్వానం
– బి అర్ ఎస్ లేదా స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి ఆలోచన
టీ మీడియా, ఆగస్టు 28, రాజకీయ ప్రతినిధి: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బి అర్ ఎస్(నాటి టి ఆర్ ఎస్) నిర్మాతల్లో ఓకరు,మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు శుక్రవారం బల ప్రదర్శన అనంతరం తన నిర్ణయాన్ని హోల్డ్ లో ఉంచారు. రెండు వారాలు అనంతరం ఆయన భవిషత్ కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది.అనుచరులు వత్తిడి మేరకు ఆయన 40 ఏళ్ల రాజకీయ జీవితం లో ఏ పార్టీ సింబల్ లేకుండా తన ఫోటో లు తో మాత్రమే ఉన్న జండాలు ఉన్న ర్యాలీ లో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తుమ్మల మధ్య వ్యక్తి గతంగా విడదీయ రాని బంధం ఉంది.. శుక్రవార జరిగిన అనుచరులు సమావేశం లో ఆయన ఆచితూచి మాట్లడారు.రానున్న ఎన్నికల భరి లో ఉంటా అని అనుచరులు కు సందేశాన్ని ఇచ్చారు.కేసీఆర్ నీ ,బి ఆర్ఎస్ నీ, అభ్యర్థులు ను ,ఓక్క మాట అనలేదు. కె సి ఆర్ కు తాను పోటీ చెయ్యను అని కూడా చెప్పానని కూడా అన్నారు. తుమ్మలకు కాంగ్రెస్, బిజెపి నుండి ఆహ్వానాలు అందాయి. అందుతున్న యి.వాటిని తిరస్కరిస్తున్నట్లు కూడా చెప్పటం లేదు తుమ్మల.కేసి అర్ నుండి ఆహ్వానం వచ్చి అయన స్వయంగా తనను పిలిచి మాట్లాడుతారు అనే ఆశాభావం తో తుమ్మ ల ఉన్నరు.కేసి అర్ తో మాట్లాడిన అనంతరం ఆ పార్టీ లో కొనసాగడం,లేదా సతంత్య్రం గా బరి లోకి దిగడం ద్వారా తన రాజకీయ సత్తా చాటాలి అనే ఆలోచన లో ఉన్నట్లు తెలిసింది.అందుకు అవసరం అయినా కార్యాచరణ లో ఉన్నట్లు గా సమాచారం.
40 ఏళ్ల లో ఏమి చేశా..?
40 ఏళ్ల రాజకీయ జీవితం లో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ఏం ఎల్ ఏ గా,మంత్రిగా ఏమి చేశా ఆన్న దాని పై శ్వేత పత్రం తయారు చేసి జనం లోకి పంపే ప్రయత్నం లో ఉన్నట్లుగాలుస్తోంది.అందు లోనే గత ఎన్ని కల్లో పార్టి లో ఉండి , పాలేరు లో ఓటమికి ఏ విధంగా కృషి చేశారు ఆన్న ది కూడా చేర్చాలిఅనేఅభిప్రాయం వచ్చినట్లు గా తెలుస్తోంది.
కాంగ్రెస్ ,బిజెపి అంటే...
కాంగ్రెస్ బిజెపి విషయం లో తుమ్మల మొదటి నుండి ఓకే వైఖరి తో ఉన్న రు..అయన కాంగ్రెస్ కి వ్యతిరేకంగా, ముఖ్యంగా జలగం కుటుంబం కు వ్యతిరేకంగా రాజకీయాల్లో కి వచ్చారు.ఎన్ టి ఆర్ సిఎం గా ఉన్నప్పుడు ఉమ్మడి జిల్లాలో ఆనాటి వామ పక్ష నేతలు ,ఎమ్మెల్యే లు బొడే పుడి వేంకటేశ్వర రావు, పువ్వాడ,మంచికంటి రాం కిషన్ రావు గార్ల లాంటి వారితో కల్సి పని చేశారు..అదే వామ పక్షాలు కు వ్యతిరేకంగా తానేంటో అనాడు 2002 లోనే చూపించారు.తమ్మినేని పాదయాత్ర కాలం లో 2003 లో దుమ్ముగూడెం ప్రాజెక్టు కోసం ఏరియల్ సర్వే చేయించారు.2004 లో కాంగ్రెస్ అధికారం లోకి వచ్చి నాటి సిఎం వైయస్ ఆఫర్ ఇచ్చినా కనీసం లొంగ లేదు.ఇప్పుడు మరొక రాజకీయ శత్రువు పొంగులేటి శ్రీనివారెడ్డి కాంగ్రెస్ లో ఉండగా ,అయన కాంగ్రెస్ లోకి వెళ్ళరు.బి జెపి విషయాని కి వస్తె అయన మొదటి నుండి ఆ పార్టీకి వ్యతిరేకం. వాజ్ పెయ్ అధికారం లో ఉన్నప్పుడు వెంకయ్య నాయుడు ఆనాడే స్వయంగా తుమ్మల తో చర్చలకు సిద్దం అయినా అయన కనీసం సమయం ఇవ్వలేదు..పాలేరు లో ఓడి పోయి నప్పుడు ఆయనకు ఆఫర్ లు వచ్చాయి.అయిన బి అర్ ఎస్ నీ వీడ లేదు అప్పటికే టి డీ పి లో ఉన్న కేసీఆర్ తో తుమ్మ ల కు సన్ని హితము గా ఉండే వారు..ఈ నేపధ్యం పరిశీలిస్తే తుమ్మలకు కాంగ్రెస్,బి జేపీ లు అంటే అప్పుడు ఇప్పుడు గిట్టు బాటు కాదు.పదవి కోసం కంటే గౌరవం మర్యాద లకు మాత్రమే తుమ్మల నాగేశ్వరరావు విలువ ఇస్తారు అని విశ్లేషకులు అభిప్రాయ ము గా ఉంది.
ALSO READ :స్వలాభం కోసమే కందాల పార్టీ మారారు
ఏంపి నామ ఎదుట ఏకరువు
ఖమ్మం ర్యాలీ కంటే ముందు ఎంపి నామ నాగేశ్వర రావు హైద్రాబాద్ లో మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఇంటికి వెళ్లి సుదీర్ఘంగా చర్చలు జరిపారు.ఈ సందర్భంగా తుమ్మల తాను 40 ఏళ్ల కాలం లో ఏమి చేసింది.టి డీ పి రాజీనామా చేసి కేసీఆర్ తో చేతులు కలపటం,అనంతర పరిణామాలు,ఖమ్మం సభ ముందు,తరువాత కేసీఆర్ జరిగిన విషయం ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ, అభ్యర్థుల ప్రకటన గురించి ఏకరువు పెట్టారనేది సమాచారం.తన ద్వారా ఉమ్మడి జిల్లాలో పార్టీ కి లాభం జరిగింది అని, తన ను ఓడించిన వ్యక్తికి టికెట్ ఇచ్చి ,పరోక్షంగా పొంగులేటి శ్రీనివాస రెడ్డి కి సహకారం అందిస్తున్నారు అని పేర్కొన్నట్లు తెలిసింది.నా వల్ల పార్టీకి నష్టం రానివ్వ ను అని,అనుచరులు చల్లా చెదురు కాకుండా మాత్రమే చూస్తా అని ఆధి కూడా కొద్దికాలం మాత్రమే అని స్పష్టం చేసి నట్లు తెలిసింది. విషయాలు కేసీఆర్ దృష్టికి తీసుకు వెళతాను అని నామ ఇచ్చిన హామీ మేరకు ర్యాలీ తో సరి పెట్టీ నట్లు సమాచారం.
ALSO READ :పాలేరు పై పొంగులేటి దృష్టి
కేసి అర్ పిలుపు కోసం…
తుమ్మల కేసీఆర్ పిలుపు కోసం ఎదురు చూస్తు న్నట్లు గా తెలుస్తోంది.సుధీర్ఘంగా వారిద్దరి మధ్య టిడిపి నుండి వ్యక్తిగత సమాందాలు ఉన్నయి..తెలంగాణ ఉద్యమం లో తుమ్మల పాల్గొనక పోయిన, పార్టీ పెట్టే సమయం లో ఆనాటి రాజకీయ పరిణామాల్లో బైటకు రాక పోయినా కేసి ఆర్ తో నిత్యం తుమ్మల టచ్ లో ఉన్నట్లు అప్పట్లోనే ప్రచారం ఉంది.తెలుగు దేశం లో ఉండగా నామ నాగేశ్వర రావు తో కూడా అయన విభేదించారు. నామ రాజకీయ అరిగ్రేటం నుండే వారిద్దరి మధ్య ప్రారంభం అయిన వార్..కేసీఆర్ ఆహ్వానం మేరకు టి ఆర్ ఎస్ లో నామ చేరేవరకు కొన సాగింది.. పార్టీ లో చేరిన అనంతరం కేసీఆర్ ఇద్దరి నాగేశ్వర రావు లమధ్య కుదిర్చిన సయోధ్య బలోపేతం గా సాగుతోంది. ఆ క్రమంలో నే ఖమ్మం లో బి ఆర్ఎస్ బహిరంగ సభకు పెద్ద దిక్కుగా తుమ్మల వ్యవహరించడం వెనుక నామ నాగేశ్వరరావు కృషి ఉంది.కేసి అర్ ఆదేశాలు మేరకు ఎంపి నామ ,మంత్రి హరీష్ రావుల బృందం గండుగుల పల్లి లో తుమ్మల ఇంటికి వెళ్ళి మట్లడారు.అంత కంటే కొద్ది రోజుల ముందే సత్తుపల్లి ఏం ఎల్ సండ్ర అనుచరులు తుమ్మల పై పరోక్షంగా ఘాటైన వ్యాఖ్యలు చేశారు.అనంతర పరిణామాలు లో జలగం వెంకట్రావు, తుమ్మల ఇద్దరినీ ఎంపి నామ ఖమ్మం సభ బాధ్యతలు కు ఆహ్వానించారు.ఇటువంటి అనేక విషయాలు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు బి ఆర్ఎస్ వీడే అవకాశాలు లేవు అని స్పష్టం చేస్తున్నాయి.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube