హోలీకి ముందే ఈ వస్తువులు బయట పడెయ్యండి.

హోలీకి ముందే ఈ వస్తువులు బయట పడెయ్యండి.

0
TMedia (Telugu News) :

హోలీకి ముందే ఈ వస్తువులు బయట పడెయ్యండి..

లహరి, మార్చి 3, కల్చరల్ : హోలికి ముందే ఇంట్లోంచి కొన్ని వస్తువులను తీసేస్తే జీవితంలో నుంచి చెడు తొలగిపోతుందని పండితులు చెబుతున్నారు. ఇంట్లో కొన్ని అంశాలు చేరితే నెగెటివ్ ఎనర్జీని పెంచేస్తాయి. హోలీ రాకముందే వాటిని ఇంటి నుంచి తీసెయ్యాలి. హోలీ వసంతానికి ఆహ్వానం పలికే పండుగ. వసంతం అంటేనే జీవితంలో ఆనందాలకు ప్రతీక. ఈ ఆనందాలను సాదరంగా ఆహ్వానించేందుకు అనుకూలమైన వాతావరణం ఇంటా బయటా ఏర్పాటు చేసుకోవడం అవసరం. వీటి భంగం కలిగించే ఎలాంటి ఆటంకాన్నైనా ఇంట్లోంచి తొలగించాలి. ఇలా తొలగించాల్సిన వస్తువుల జాబితా గురించి వాస్తు వివరిస్తోంది. మన దేశంలోని ప్రతి ప్రాంతంలోనూ హోలీ పండుగ జరుపుకుంటారు. ఒకరికొకరు ప్రేమగా రంగులు అద్దుకుంటారు. హోలీ రోజున దేవతలకు పూజ తర్వాత గులాల్ సమర్పిస్తే చాలా సంతుష్టులవుతారని శాస్త్రాలు చెబుతున్నాయి. హోలికా దహనం ఈ ఏడాది మార్చ్ 7న జరుగుతుంటే హోలీ 8న జరుపుకుంటున్నాం. హోలీతో వసంతం ప్రవేశిస్తుంది.

Also Read : రావి చెట్టును పొరపాటున కూడా మీ ఇంట్లో పెంచుకోవద్దు..

వసంత రుతువుకు ఆహ్వానం పలికే ఈ పండగలో అందానికి, ఆనందానికి ప్రతీక, ఈ ఆనందం కలకాలం నిలుపుకోవడానికి కొన్ని చిన్నచిన్న వాస్తు నియమాలు పాటిస్తే ఈ హోలీ తర్వాత జీవితంలో ఆనందాలు వెల్లివిరుస్తాయని వాస్తు పండితులు అంటున్నారు. వాస్తు జీవన విధానానికి సంబంధించిన అనేక విషయాలను చర్చిస్తుంది. వాస్తు చెప్పే ఈ చిన్న నియమాలు పాటించి నెగెటివిటిని దూరం పెట్టుకోవచ్చు.

పాడైపోయిన ఎలక్ట్రానిక్స్ వస్తువులు…
ఇంట్లో చెడిపోయిన ఎలక్ట్రానిక్ వస్తువులు ఉంటే నష్టం జరుగుతుంది. వీటి వల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తి చేరుతుంది. కాబట్టి ఇంట్లో పాడైపోయిన ఎలక్ట్రానిక్ వస్తువులను బాగు చేయించాలి అది వీలుకానపుడు బయట పడెయ్యడం అవసరం.

విరిగిపోయిన శిల్పాలు, పాడైపోయిన చిత్రాలు…
విరిగిపోయిన శిల్పాలు, దైవ విగ్రహాలు, బొమ్మలు ఉంచుకోవడం అశుభం. అటువంటి విగ్రహాలు, బొమ్మలు ఇంట్లో ఉండే వెంటనే వాటిని నిమజ్జనం చెయ్యడం అవసరం.

చెడిపోయిన గడియారాలు…
గోడ మీద చెడిపోయిన గడియారాలు గోడ మీద ఎప్పుడు ఆగిపోయాయో పెద్దగా పట్టించుకోము. కానీ ఇలా చెడిపోయిన లేదా ఆగిపోయిన గడియారాలు ఇంట్లో పెట్టుకోవడం అంత మంచిది కాదు. అటువంటి గడియారాలు ఇంట్లో ఎక్కడ ఉన్నా తొలగించాలి. ఇవి ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీని ఆహ్వానిస్తాయి. కనుక వీటిని వెంటనే తొలగించాలి.

Also Read : మీ కోరికలు నెరవేరాలంటే..

పాత చెప్పులు లేదా బూట్లు…
హోలీకి ముందు ఇంటిని శుభ్రపరిచే సమయంలో పాత, పాడైపోయిన, చిరిగిపోయిన, విరిగిపోయిన చెప్పులు తీసేయ్యడం మరచిపోవద్దు. ఇవి కూడా ఇంట్లోకి ప్రతికూలతను ఆహ్వానిస్తాయి. దురదృష్టాన్ని తీసుకొస్తాయి. కనుక తప్పని సరిగా పాత చెప్పులు బయట పడెయ్యాలి.

పగిలిన అద్దాలు..
పగిలిన గాజు వస్తువులు, పగుళ్లు చూపిన అద్దాలు ఇంట్లో పెట్టుకోవడం మంచిది కాదు. హోలీ రావడానికి ముందే అలాంటి వస్తువులు ఇంట్లో కనిపిస్తే వెంటనే తీసెయ్యాలి. ఇలా పగిలి పోయిన లేదా పగుళ్లు చూపించిన అద్దాలు ఇంట్లోకి ఉద్రిక్త పరిస్థితులను ఆహ్వానిస్తాయి. అవి ఇంట్లో రకరకాల ఇబ్బందులకు కారణం కావచ్చు. కనుక వాటిని వెంటనే తొలగించాలి.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube