ఇళ్ల నిర్మాణాలకు టిఎస్ బిపాస్ ద్వారానే అనుమతులివ్వాలి
ఇళ్ల నిర్మాణాలకు టిఎస్ బిపాస్ ద్వారానే అనుమతులివ్వాలి
ఇళ్ల నిర్మాణాలకు టిఎస్ బిపాస్ ద్వారానే అనుమతులివ్వాలి
టీ మీడియా,ఏప్రిల్ 21,హైదరాబాద్ : పట్టణాల్లో ఇళ్ల నిర్మాణాలకు టిఎస్ బిపాస్ ద్వారా మాత్రమే అనుమతులు ఇవ్వాలని, ప్రతి మున్సిపాలిటీలో వెజ్, నాన్ వెజ్ మార్కెట్లతో పాటు వైకుంఠధామాలను నిర్మించాలని మంత్రి కెటిఆర్ ఆదేశించారు. వరంగల్, హనుమకొండ జిల్లాలకు సంబందించిన మున్సిపాలిటీల అభివృద్ధికి సంబంధించి హనుమకొండ జిల్లా అభివృద్ధిపై కలెక్టరేట్లో రాష్ట్ర ఐటి, పురపాలక శాఖల మంత్రి కెటిఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
Also Read : టిఆర్ఎస్ కార్యకర్తలకు ప్రభుత్వం భరోసా
ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ గ్రీన్ బడ్జెట్‌ను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కెటిఆర్ అధికారులకు సూచించారు. ఆధునిక దోబీ ఘాట్లను నిర్మించాలని మంత్రి సూచించారు. బయోమైనింగ్ ద్వారా డంప్ యార్డులో చెత్త నిర్వీర్యం చేయాలని మంత్రి పేర్కొన్నారు. ప్రతి మున్సిపాలిటీలో మానవ వ్యర్థాల శుద్ధీకరణ ప్లాంట్లను నిర్మించాలన్నారు. పేదలకు రూపాయికే నల్లా కనెక్షన్ ఇవ్వాలన్నారు. అన్ని పట్టణాల్లో మాస్టర్ ప్లాన్ పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. డిజిటల్ డోర్ నెంబరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలని మంత్రి కెటిఆర్ సూచించారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube