ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలి

-పోడు హక్కు పత్రాలు ఇచ్చే వరకు పోరాడుతాం

1
TMedia (Telugu News) :

ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలి

 

-పోడు హక్కు పత్రాలు ఇచ్చే వరకు పోరాడుతాం

 

-తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం

 

టీ మీడియా, అక్టోబర్ 19,బూర్గంపాడు : ఇండ్లు లేని పేదలందరికీ ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు అన్నవరపు కనకయ్య, జిల్లా అధ్యక్షులు రేపాకుల శ్రీనివాస్ లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, బుధవారం నాడు బూర్గంపాడు లో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మండల ఆరవ మహాసభ ఎస్ కే అబీదా అధ్యక్షతన జరిగింది, ఈ మహాసభల ప్రారంభ సూచికగా సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బత్తుల వెంకటేశ్వర్లు జెండా ఆవిష్కరించారు, అనంతరం జరిగిన సభలో వారు మాట్లాడుతూ మండలంలో ఇంటి స్థలం లేక పేదలు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు, ప్రభుత్వం ఇంటి స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Also Read : ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష

అదే విధంగా రేషన్ షాపుల ద్వారా కేరళ ప్రభుత్వం ఇచ్చినట్లు 14రకాల సరుకులు ఇవ్వాలని డిమాండ్ చేశారు, రేషన్ కార్డులు లేని పేదలందరికీ వెంటనే రేషన్ కార్డులు ఇవ్వాలని అన్నారు,గత సంవత్సరం పేదల నుంచి లాక్కున్న పోడు భూములు సాగు చేసిన వారికి ఇచ్చి సర్వే చేయాలని కోరారు , అటవీ హక్కుల చట్టం ప్రకారం 2005సంవత్సరం నాటికి సాగులో ఉన్న పోడు భూములలో మొక్కలు పెట్టడం సరికాదని అన్నారు, తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పోడు సర్వే పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు ఐద్వా, సీఐటీయూ నాయకులు సంఘీభావం తెలిపారు,ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి బయ్య రాము, నిమ్మల అప్పారావు, వహీదా, పాపినేని సరోజన,బర్ల తిరపతియ్య ,మిడియం శ్రీను,కౌలూరి నాగమణి,బాదం వెంకటమ్మ, బత్తుల పద్మ,సోయం నాగమణి,మడకం సైదమ్మ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube