స్వలింగ సంపర్కులపై వివక్ష చూపకూడదు
– సీజేఐ డీవై చంద్రచూడ్
టీ మీడియా, అక్టోబర్ 17, న్యూఢిల్లీ: స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు మంగళవారం తీర్పును వెలువరించింది. సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల ధర్మాసనం ఈ తీర్పును ఇచ్చింది. ధర్మాసనంలో చంద్రచూడ్‌తో పాటు జస్టిస్ సంజయ్ కిషణ్ కౌల్, ఎస్ రవీంద్ర భట్, హిమా కోహ్లీ, పీఎస్ నర్సింహా ఉన్నారు. సీజే చంద్రచూడ్ ఇవాళ కోర్టులో తీర్పును చదివారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ కౌల్, జస్టిస్ భట్, జస్టిస్ పీఎస్ నర్సింహాతో పాటు తాను కూడా తీర్పును వెలువరించనున్నట్లు చెప్పారు.M స్వలింగ సంపర్కుల వివాహాన్ని ప్రాథమికంగా గుర్తించలేమని సీజే చంద్రచూడ్ తెలిపారు. సేమ్ సెక్స్ మ్యారేజ్‌పై భిన్నాభిప్రాయాలు ఉన్నట్లు ఆయన చెప్పారు. హోమోసెక్స్ లేదా విచిత్ర వైఖరి కేవలం పట్టణ విధానం కాదు అని, సమాజంలో అది కేవలం ఉన్నత వర్గాలకు చెందినది మాత్రమే కాదు అని సీజే అన్నారు. స్వలింగ వివాహాలపై కోర్టు చట్టాన్ని రూపొందించలేదన్నారు. పెళ్లి అనేది స్థిరమైన, మార్పులేని వ్యవస్థ అన్న భావన కరెక్టు కాదు అని, ఒకవేళ ప్రత్యేక మ్యారేజ్ చట్టాన్ని కొట్టివేస్తే, అప్పుడు దేశం స్వాతంత్య్రానికి కంటే ముందు రోజుల్లోకి వెళ్తుందన్నారు. కేవలం పార్లమెంట్ ద్వారానే స్పెషల్ మ్యారేజ్ యాక్టులో మార్పులు చేయాలని సీజే సూచించారు. శాసన వ్యవహారాల్లోకి కోర్టు జోక్యం చేసుకోదు అని చంద్రచూడ్ తెలిపారు. లైంగిక ప్రవృత్తి ఆధారంగా వివక్ష ప్రదర్శించడం సరికాదు అని సీజే అన్నారు. పెళ్లి చేసుకున్న ఆడ-మగ జంట మాత్రమే పిల్లలకు స్థిరత్వాన్ని ఇవ్వగలదన్న ఆధారాలు ఎక్కడా లేవన్నారు.
Also Read : చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
స్త్రీ-పురుష జంటలకు కల్పించే సేవల్ని .. స్వలింగ సంపర్కులకు ఇవ్వకపోవడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే అవుతుందని సీజే అన్నారు. దత్తత హక్కులకు ఎల్జీబీటీ జంటలకు కల్పించకపోవడం ఆర్టికల్ 15ను ఉల్లంఘించినట్లు అవుతుందని సీజే తెలిపారు. లైంగిక ప్రవృత్తి ఆధారంగా స్వలింగ జంటల పట్ల వివక్ష చూపడం కరెక్టు కాదు అని, ఆయా వ్యక్తుల పట్ల వివక్ష చూపకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని సీజే తన తీర్పులో పేర్కొన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube