ఇంటర్ టాపర్లకు సన్మానం

ఇంటర్ టాపర్లకు సన్మానం

1
TMedia (Telugu News) :

ఇంటర్ టాపర్లకు సన్మానం

టీ మీడియా, జూన్ 30, వనపర్తి బ్యూరో : వనపర్తి జిల్లా కేంద్రంలోని అందుబాటులో ఉన్న ఇంటర్ విద్యార్థులకు జిల్లా,రాష్ట్ర మార్కులు వచ్చిన వారికి అఖిలపక్ష ఐక్యవేదిక నాయకులు బుధవారం వారి వారి కాలేజీలకు వెళ్లి ఘనంగా సన్మానించారు. ముందుగా స్కాలర్స్ కాలేజ్ కి వెళ్లి స్టేట్ బోర్డ్ ర్యాంకర్ బైపీసీలో 990 మార్కులు సాధించిన మేఘనకు,ఫస్ట్ ఇయర్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ 437 మార్కులతో సాధించిన మహితకు మిగతా ర్యాంకర్లకు సన్మానం చేయడం జరిగింది. అక్కడి నుండి జాగృతి కాలేజీలో 436 మార్కులతో రాష్ట్రస్థాయి రెండో ర్యాంకు సాధించిన వైష్ణవికి,

 

Also Read : సీసీ రోడ్డు కి భూమి పూజ

 

మూడవ ర్యాంకు సాధించిన యంగ్ నందిని తో పాటు ఇతర ర్యాంకర్లను సన్మానించిన తర్వాత అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా విద్యార్థులను ప్రోత్సహిస్తూ వస్తున్న మేము విద్యార్థులు మనోధైర్యాన్ని నింపే విధంగా సన్మానాలు చేస్తూ వస్తున్నాము.ఈరోజు అందుబాటులో ఉన్న టాప్ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు సన్మానం చేయడం జరిగింది.రేపు ఎల్లుండి కూడా మిగతా రాష్ట్ర, జిల్లా, పట్టణ,ర్యాంకర్లకు అఖిలపక్ష ఐక్యవేదిక తరపున సన్మానం చేయడం జరుగుతుందని అలాగే గవర్నమెంట్ కళాశాలలో చదివి ఉత్తీర్ణులైన అత్యధిక మార్కులు కలిగిన వారికి కూడా సన్మానం చేసి ప్రోత్సహించడం జరుగుతుందని ఐక్యవేదిక నాయకులు సతీష్ యాదవ్ చిరంజీవి,వెంకటేష్,రమేష్ వైఎస్ఆర్ సతీషు, తెలిపారు. ఈ సన్మానంలో అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube