పోలీసు దంపతులకు సన్మానం 

పోలీసు దంపతులకు సన్మానం 

1
TMedia (Telugu News) :

పోలీసు దంపతులకు సన్మానం

టి మీడియా, సెప్టెంబర్ 4,కరీంనగర్: మోతుకులగుడెం జమ్మికుంటకు చెందిన కరీంనగర్ పోలీసు కమిషనరేట్ పరిధిలో పనిచేసే పోలీస్ దంపతులు ఆకుల సతీష్,స్వప్న దంపతులకు మహిళా పోలీసు స్టేషన్  ఇన్స్పెక్టర్ బి. శ్రీనివాస్ సమక్షంలో ఆదివారం ఒమాన్ తెలంగాణ ఫ్రెండ్స్ అధ్యక్షులు డా. నరేంద్ర పన్నీరు  వారిని కలసి శాలువాతో సన్మానించి మెమోంటో అందజేశారు.ఈ సందర్భంగా డా. నరేంద్ర పన్నీరు మాట్లాడుతూ వీరి సేవలు ఆమోఘమని పోలీసులు గా విధులు నిర్వహిస్తూ  సామాజిక భాద్యత తో ఎంతో మందికి సహాయం అందిస్తున్నారని సతీష్ కరోన సమయంలో ఫ్రంట్ లైన్ వారియర్ గా ముందుండి లోక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన పేద వారికి  బియ్యం, నిత్యావసర సరుకులు  అందించారని, స్వప్న గారు షీ టీం లో పనిచేస్తూ  దాదాపు 50 వెయ్యిలకు పైగా  మహిళలకు అవర్నెస్  అందించారని కొనియాడారు. ఉపాధ్యక్షులు కుమార్ మంచికట్ల మాట్లాడుతూ ఒమాన్ తెలంగాణ ఫ్రెండ్స్ కూడా సేవా కార్యక్రమాలు చేయడమే కాకుండా సేవ చేసేవారిని అభినందించి ప్రోత్సహించడం లో కూడా ముందు ఉంటుందని తెలిపారు. ఇక ముందు కూడా వీరు ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని భగవంతుడు వారికి సేవ చేసే సామర్థ్యం ఇవ్వాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఒమాన్ తెలంగాణ ఫ్రెండ్స్ అధ్యక్షులు డాక్టర్ నరేంద్ర పన్నీరు, ఉపాధ్యక్షులు మంచికట్ల కుమార్, కార్యదర్శి వంకాయల కార్తిక్, వోలవేని తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube