నిజాయితీని చాటుకున్న ఆటో డ్రెైవర్

నిజాయితీని చాటుకున్న ఆటో డ్రెైవర్

2
TMedia (Telugu News) :

నిజాయితీని చాటుకున్న ఆటో డ్రెైవర్

 

టీ మీడియా, అక్టోబర్ 26, బెల్లంపల్లి : బెల్లంపల్లి ఆటో డ్రైవర్ రమేష్ బుధవారం 11 గంటల సమయం లో తాండూర్ మండలం ఐబి నుండి బెల్లంపల్లికి ఆటోలో వస్తున్న క్రమంలో ఆటోలో ఎక్కిన ప్యాసింజర్ బెల్లంపల్లిలో దిగి అతని సెల్ ఫోన్ ఆటోలో మరిచి వెళ్లిపోయాడు. అది గమనించిన బెల్లంపల్లి లోకల్ ఆటో డ్రైవర్ రమేష్ ఆటో యూనియన్ ప్రెసిడెంట్ కట్ట రామ్ కుమార్ కు సమాచారం అందించి దొరికిన సెల్ ఫోన్ను ఆటో యూనియన్ ప్రెసిడెంట్ కు అందజేశాడు.

Also Read : జిఎంఆర్ఎం ట్రస్టు ఆధ్వర్యంలో నిత్య అన్నదాన కార్యక్రమం

సెల్ ఫోన్ పోగొట్టుకున్న వారిని పిలిపించి ఆటో డ్రైవర్ రమేష్ చారి చేతుల మీదగా ఆటో యూనియన్ ప్రెసిడెంట్ అందజేశారు. ప్యాసింజర్స్ ఆటోలలో ఎక్కి వారి తొందరపాటు వలన వారికి సంబంధించిన వస్తువులు మరిచిపోతున్నారు. ఆటో డ్రైవర్లు గమనిస్తే అది తీసుకువచ్చి ఆటో యూనియన్ అందజేస్తే ఆటో యూనియన్ల ద్వారా మర్చిపోయిన ప్యాసింజర్లకు వారి అందజేయడం జరుగుతుంది తేలియచేసారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube