విద్యార్థికి సన్మానం

0
TMedia (Telugu News) :

టీ మీడియా నవంబర్ 5 వనపర్తి : వనపర్తి జిల్లా కేంద్రంలో మున్సిపల్ కాంట్రాక్టర్ అయినా రామకృష్ణ కుమార్తె ఎస్.అఖిల నీట్ పరీక్షలో ఉత్తీర్ణులై ఎంబిబిఎస్ కై అర్హత సాధించిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ కౌన్సిలర్ సతీష్ యాదవ్ ఆధ్వర్యంలో వారి ఇంటికి వెళ్లి గురువారం శాలువాతో ఘనంగా సన్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ సతీష్ యాదవ్ మాట్లాడుతూ మహిళలు తలచుకుంటే ఏదైనా సాధించగలరు అని పురుషులతో పాటు మహిళలు కూడా సమానంగా అన్ని రంగాల్లో రాణించగలరని అఖిల ముందు ముందు వారి కుటుంబానికే కాక వనపర్తికి గొప్ప పేరు తేవాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపి వారికి స్వీట్ తినిపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 21 వవార్డు కౌన్సిలర్ వెంకటేష్ ,బిఎస్పి జిల్లా ఉపాధ్యక్షులు చిరంజీవి, వైయస్సార్ టి.పి నాయకులు నాగవరం వెంకటేష్ ,ఎస్.పి నాయకులు జయరాములు, ఆర్యవైశ్య నాయకులు రంగయ్య అఖిల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube