షాప్ యజమానులకు సన్మానం

షాప్ యజమానులకు సన్మానం

1
TMedia (Telugu News) :

షాప్ యజమానులకు సన్మానం

టీ మీడియా, ఆగస్టు 6, వనపర్తి బ్యూరో : వనపర్తి జిల్లా కేంద్రంలో రోడ్డు వెడల్పు త్వరగా పూర్తి చేయాలి, అడ్డుగా ఉన్న నాయకులు వారి షాప్ లను వెంటనే తేసివేసుకోవలి అని అఖిలపక్ష ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేశారు. రాజీవ్ చౌక్ లో రోడ్ వెడల్పుల్లో భాగంగా కోట్ల రూపాయల విలువగల షాపులను స్వచ్ఛందంగా కూలగొట్టుకొన్న వెంకటేశ్వర షాప్ ఓనర్. కార్తిక్ యాదవ్ , అయ్యoగారి బేకరీ ఓనర్, ఉస్మాన్ షు మార్ట్, మొబైల్ షాప్ ఓనర్ రాజశేఖర్ లను అఖిలపక్ష ఐక్య వేదిక నాయకులు సన్మానించారు.

 

Also Read : టీఆర్ఎస్ నుండి మున్సిపల్ చైర్మన్ సస్పెండ్

ఈ సందర్భంగా అధ్యక్షుడు సతీష్ యాదవ్ మాట్లాడుతూ
రోడ్డు వెడల్పు నత్త నడకన నడుస్తుంది. రోడ్డు వెడల్పుకు అడ్డంగా ఉన్న నాయకుల ఇల్లు తీసివేయాలని వారిని మిగతావారు కూడా అనుసరిస్తారని గతంలో పిలుపునివ్వడం జరిగింది. దానికి అనుగుణంగా కొందరు షాప్ యజమానులు ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని తామే ముందుకు వచ్చి తమ షాపులు కూలగొట్టుకోవడం చాలా గర్వనీయం ఎందుకంటే మామూలు వేల రూపాయల విలువ గలవి కూడా తీసుకొని ఈరోజుల్లో కోట్ల రూపాయల విలువగల షాపులను ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని తమంటత తామే కులకొట్టుకోవడం అనేది చాలా అభినందనీయం. ఈ క్రమంలో షాపులను కూలగొట్టుకున్న అని చెప్తున్న నాయకులు వీరికి అభినందనలు చెప్పాల్సింది కానీ, వారు తెలుపనందున మేము ముందుకు వచ్చి అభినందనలు తెలుపుతున్నాము.

 

Also Read : honor tyo shop owners జయశంకర్ కు నివాళి

ఇలాంటి లాభం ఆశించకుండా చేస్తున్న వీరికి మంత్రి, కలెక్టర్ తగిన పరిహారం ఇవ్వవలసిందిగా కోరుతున్నాము. వీరిని చూసి రోడ్డు వెడల్పుకు అడ్డుగా ఉన్న ముఖ్య నాయకులు సిగ్గుపడి తమ అడ్డుగా ఉన్న షాపులను వెంటనే తొలగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. ప్రభుత్వం కూడా నష్టపరిహానాన్ని వెంటనే అందించాల్సిందిగా కోరుతున్నాము
ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు వెంకటేష్, కో కన్వీనర్ చిరంజీవి, రమేష్ ,వైఎస్ఆర్టీపీ సతీష్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube