వాసవి సేవా సమితి అధ్యక్షుడుకి సన్మానం

వాసవి సేవా సమితి అధ్యక్షుడుకి సన్మానం

1
TMedia (Telugu News) :

వాసవి సేవా సమితి అధ్యక్షుడుకి సన్మానం

టీ మీడియా, అక్టోబర్ 20, వనపర్తి బ్యూరో : వరంగల్ పట్టణంలో కన్నతల్లి ఫౌండేషన్ వారు కీర్తి కిరీటి జాతీయ టాలెంట్ అవార్డును పూరి సురేష్ శెట్టికి ప్రధానం చేయడం జరిగింది.ఈ సందర్భంగా గురువారం వనపర్తి పట్టణం వాసవి సేవా సమితి కార్యాలయంలో జాతీయ అధ్యక్షుడు పూరి సురేష్ శెట్టిని సన్మానించారు. ఈ సందర్భంగా వనపర్తి పట్టణంలోని ఆర్యవైశ్యులు వారిని మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు.ఈ సందర్భంగా వనపర్తి జిల్లా ఎడ్యుకేషన్ ట్రస్ట్ అధ్యక్షుడు ఎలిశెట్టి వెంకటేష్ మాట్లాడుతూ పూరి సురేష్ శెట్టి కరోనా టైంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి అదే విధంగా కరోనా మందులు, అనందయ్య మందులు కూడా ఉచితంగా పంపిణీ చేసి చాలామందికి ఉపయోగపడ్డారు.

Also Read : ఇచ్చోడ మండలం లో మత్తు ఇంజెక్షన్ కలకలం…

చాలామందికి నిత్యవసర సరుకులు అందించారు.వనపర్తి పట్టణం నుంచి జాతీయస్థాయిలో ఈ కార్యక్రమాలు చేసినందుకు ఎంతో గర్వకారణం ఇలాంటి కార్యక్రమాలు మున్ముందు, ఇంకా చాలా నిర్వహించాలని కోరుకుంటున్నాము.ఈ కార్యక్రమంలో గోవిందు గుప్త, మణిదీప్, కార్తీక్, వజ్రాలసాయిబాబా, వంశీ, వరప్రసాద్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube