విద్యార్థి కి సన్మానం

విద్యార్థి కి సన్మానం

1
TMedia (Telugu News) :

విద్యార్థి కి సన్మానం
టి మీడియా,జూలై18,మధిర:
సిరిపురం గ్రామంలో ఇంటర్ లో ఖమ్మం జిల్లాలో ప్రథమ స్థానం పొందిన సిరిపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని ఇమ్మడి త్రివేణి నీ జాతీయ ఉత్తమ ఉపాద్యాయ అవార్డు గ్రహీత నల్లమల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గణం గా సన్మానించారు .ఈ కార్యక్రమానికి సిరిపురం గ్రామ సర్పంచి అధ్యక్షత వహించారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఇంచార్జీ సలీమ్ గారు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన మధిర మండల విద్యాధికారి మాట్లాడుతూ త్రివేణి జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ఎంతో మంది స్ఫూర్తి, ప్రేరణ పొందితే ఈ కార్యక్రమానికి అర్థం ఉంటుంది అని, ఏమీ ఆశించకుండా ఈ కార్యక్రమం ను నిర్వహిస్తున్న జాతీయ ఉత్తమ ఉపాద్యాయ అవార్డు గ్రహీత నల్లమల శ్రీనివాసరావు గారిని అభినందిస్తూ ఇంకాముందుముందు ఇలాంటి మంచి కార్యక్రమం లు నిర్వహించాలని కొనియాడారు.

 

Also Read : కలెక్టర్ విస్తృత పర్యటన

ఈసందర్భంగా త్రివేణీ తో పాటు సర్పంచి నీ , సలీమ్ గారిని, త్రివేణీ తల్లితండ్రులు ను. తాత కంచర్ల వెంకటేశ్వర్లు గారిని నల్లమల శ్రీనివాసరావు గారు సన్మానించారు ప్రభుత్వ జూనియర్ కళాశాల లెక్షరర్ త్రివేణి కి 1116లు ప్రోత్సాహకంగా ఇచ్చిన అరుణా గారిని నల్లమల అభినందించారు .ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, విద్యార్థులు, యువకులు పాల్గొని విజయవంతం చేశారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube