నేను డాక్టర్‌ అవ్వాలని అమ్మ ఆశపడింది : మంత్రి కేటీఆర్‌

నేను డాక్టర్‌ అవ్వాలని అమ్మ ఆశపడింది: మంత్రి కేటీఆర్‌

1
TMedia (Telugu News) :

నేను డాక్టర్‌ అవ్వాలని అమ్మ ఆశపడింది: మంత్రి కేటీఆర్‌

టీ మీడియా, డిసెంబర్ 3, హైదరాబాద్‌: వైద్య వృత్తి ఎంతో ఉన్నతమైనదని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ప్రతి ఇంట్లో వారి పిల్లల్లో ఒకరైన డాక్టర్‌ కావాలని కోరుకుంటారు. అలానే నేనూ డాక్టర్‌ అవ్వాలని మా అమ్మ కోరుకుందని మంత్రి చెప్పారు. హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్‌లో జరిగిన ఉమెన్‌ ఇన్‌ మెడిసిన్‌ కాంక్లేవ్‌కు మంత్రి కేటీఆర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైద్యులు కుటుంబ జీవితాన్ని త్యాగం చేస్తారన్నారు. ఎప్పుడు ఏ ఎమర్జెన్సీ ఉన్నా అటెండ్‌ అవుతారని తెలిపారు. వైద్య రంగంలో మహిళలు అద్భుత ప్రతిభ కనబరుస్తున్నారని చెప్పారు.

Also Read : బాల్య దశ నుండే పొదుపు అలవాటు చేసుకోవాలి

వైద్యులందరికీ హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.అన్నిరంగాలకు హైదరాబాద్‌ కేరాఫ్‌ అడ్రస్‌గా మారిందని చెప్పారు. తెలంగాణ మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. మహిళా సాధికారతకు తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని తెలిపారు. మహిళా పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించడానికి వీ-హబ్‌ ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలో మహిళా యూనివర్సిటీని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నామని వెల్లడించారు. జెండర్ ఈక్వాలిటీ పాలించే రాష్ట్రాల్లో తెంగాణ ఒకటన్నారు.కొన్నేండ్లుగా భారతీయ వైద్యరంగం ఎంతో పురోగతి సాధించిందని అన్నారు. కరోనా సమయంలో ఏఐజీ ఆస్పత్రి మంచి సేవలు అందించిందని చెప్పారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube