ఇండ్ల రుణ వడ్డీ చౌక ..ఎందుకంటే?!
టీ మీడియా ఏప్రిల్ 9,న్యూఢిల్లీ: సొంతింటి కల సాకారం చేసుకోవాలని భావించే వారికి అధిక రుణ పరపతి కల్పిస్తూ ఆర్బీఐ శుక్రవారం కీలక నిర్ణయం తీసుకున్నది. హోంలోన్ నిబంధనలను వచ్చే ఏడాది మార్చి (2023 మార్చి 31) నెలాఖరు వరకు హేతుబద్ధీకరిస్తూ ఆర్బీఐ ద్రవ్య పరపతి కమిటీ (ఎంపీసీ) నిర్ణయించింది. ఇంతకుముందు కరోనా మహమ్మారి నేపథ్యంలో 2020 అక్టోబర్‌లో రిస్క్ వెయిట్స్‌ను హేతుబద్ధీకరించింది. 2022 మార్చి నెలాఖరు వరకు ఇండ్ల రుణాలు తీసుకున్న వారికి లోన్ టు వాల్యూ (ఎల్టీవీ) నిష్పత్తిని మాత్రమే పరిగణనలోకి తీసుకుంది.
Also Read : సీనియర్ నటుడు ‘బాలయ్య’ కన్నుమూత
సొంతిండ్లకు గల ప్రాముఖ్యత, వివిధ రంగాలపై దాని ప్రభావాన్ని గుర్తిస్తూ.. ఎల్టీవీ నిష్పత్తి గైడ్‌లైన్స్ వచ్చే ఏడాది మార్చి నెలాఖరు వరకు పొడిగించింది. దీనివల్ల సొంతింటిని కొనుగోలు చేయాలని భావించే వారికి ఈ గైడ్‌లైన్స్ ప్రకారం అధిక రుణ పరపతి లభిస్తుంది. అంటే కొత్త రుణాలను రుణ విలువతో మాత్రమే అనుసంధానిస్తారు. దీని ప్రకారం రిస్క్ వెయిట్‌ను హేతుబద్ధీకరిస్తామని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు.లోన్ టు వాల్యూ (ఎల్టీవీ) విలువ 80 శాతం అంతకంటే తక్కువ ఉంటే, రిస్క్ వెయిట్ 35 శాతం.. 80 శాతానికి పైగా / 90 శాతం ఎల్టీవీ ఉంటే రిస్క్ వెయిట్ 50 శాతం ఇస్తారు. బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు ఇచ్చే ఇండ్ల రుణాల కోసం పక్కన బెట్టే మొత్తం నిధులను రిస్క్ వెయిట్ అని పిలుస్తారు. రిస్క్ వెయిట్ ఎక్కువగా ఉంటే బ్యాంకులు రుణాలివ్వడానికి ముందుకు రావు.కరోనా ప్రారంభంలో అంటే 2020లో హౌసింగ్ రంగం సేల్స్ 50 శాతం పడిపోయాయి. గతేడాది ఇండ్ల విక్రయాలు శరవేగంగా పుంజుకున్నాయి. చారిత్రక స్థాయిలో తక్కువ వడ్డీరేట్లు ఉండటం కూడా ఇండ్ల కొనుగోళ్లు పెరగడానికి ఒక కారణంగా భావిస్తున్నారు. ప్రస్తుతం బ్యాంకులు 6.5 శాతం వడ్డీరేట్లపై ఇండ్ల రుణాలిస్తున్నాయి.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube