ఇళ్ల పట్టాల పంపీణీలో మనమే నంబర్‌ వన్: మంత్రి పువ్వాడ

ఇళ్ల పట్టాల పంపీణీలో మనమే నంబర్‌ వన్: మంత్రి పువ్వాడ

1
TMedia (Telugu News) :

ఇళ్ల పట్టాల పంపీణీలో మనమే నంబర్‌ వన్: మంత్రి పువ్వాడ
టీ మీడియా , మార్చి 14 ఖమ్మం:ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమం అర్హులందరి పరమవుతోంది. పైరవీలకు చోటులేకుండానే లబ్ధి కలుగుతోంది. కలలో కూడా ఊహించని విధంగా నిలువనీడ లేని వారికి ఒక గూడును కల్పించాలనే సంకల్పించిన తెలంగాణ ప్రభుత్వానికి ప్రతి కుటుంబం మోకరిల్లుతోంది. పథకాల పంపిణీలో ఎప్పుడూ ముందుండే ఖమ్మం ఈ కార్యక్రమంలోనూ తన స్థానాన్ని పదిల పర్చుకుంది. ఇళ్ల పట్టాల పంపిణీలో మొదటిస్థానంలో నిలిచింది. అధికార యంత్రాంగంను పరుగులు పెట్టిస్తోంది. లబ్ధిదారుల మోములో ఆనందం వెల్లివిరుస్తోంది. ఏళ్ళ తరబడి స్థిరనివాసం లేకుండా, ఎలాంటి హక్కులు లేకుండా ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకుని జీవనం కొనసాగిస్తున్న పేదలకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారి కృషితో నేడు ఖమ్మం నగరంలోని అనేక ప్రాంతాలలో దాదాపు 2500 శాశ్వత పట్టాలను పంపిణి చేశారు.రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన GO.No.58,59 కు లోబడి సుదీర్ఘంగా నివాసాలు ఏర్పాటు చేసుకున్న వారికి ఇళ్ళ పట్టాలను అందజేశారు. అందులో భాగంగా ఆదివారం 14వ డివిజన్ గొల్లగుడెం నందు మొత్తం 569 పట్టాలను పంపిణి చేశారు.14వ డివిజన్ కొత్తగూడెంలో 199, గోల్లగుడెంలో 370 మొత్తం 569 పట్టాలను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు స్వయంగా పంపిణీ చేశారు.

Also Read : పంజాబ్‌లో అభివృద్ధే అభివృద్ధి : సీఎం కేజ్రీవాల్‌

ఆదివారం గోల్లగుడెంలో ఆయా పట్టాలను మంత్రి పువ్వాడ పంపిణి అనంతరం మాట్లాడుతూ..పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో ఖమ్మం ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. పట్టాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా పేదలకు శాశ్వతంగా ఆవాసాలను కల్పించే పట్టాల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్రంలోనే నంబర్‌ వన్‌ స్థానంలో ఖమ్మం నిలిచిందన్నారు. ఎన్నో ఏళ్లుగా నిరుపేదలు కంటున్న కలలను నిజం చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన go no. 58, 59 ద్వారా లక్షల మంది జీవితాల్లో వెలుగులు నింపాయని కొనియాడారు.తెరాస ప్రభుత్వ వచ్చాక ఒక్కో సమస్యకు ముఖ్యమంత్రి కేసీఅర్ గారు పరిష్కారం చూపుతున్నారని వివరించారు.ఏళ్ళ తరబడి పరిపాలన చేసిన గత ప్రభుత్వాలు కేవలం వారి స్వార్థ రాజకీయాల కోసమే పేదలను వాడుకున్నారే తప్ప, మీకు కనీస అవసరమైన ఇళ్ళ పట్టాలు ఇవ్వలేకపోయారు గుర్తుచేశారు.ఖమ్మం నగర సర్వతాముకాభివృద్దే లక్ష్యంగా పని చేస్తున్నామని, ప్రాంతాలకు, కులాలకు, పార్టీలకు అతీతంగా అభివృద్ధి, సంక్షేమం ప్రతి ఇంటికి తీసుకెళ్తామని పేర్కోన్నారుపేదల కళ్ళల్లో ఆనందం చూడటమే నా లక్ష్యం.. అభివృద్ధిలో ఖమ్మాన్ని చూసి రాష్ట్రం అంతా ఆదర్శంగా తీసుకునే స్థాయికి తీసుకెళతానని హామి ఇచ్చారు.కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ , డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారాకూరాకుల నాగభూషణం, సుడా చైర్మన్ విజయ్ కుమార్, కార్పొరేటర్లు కూరాకుల వలరాజు, కొత్తపల్లి నీరజ, నాగండ్ల కోటిలక్ష్మి ప్రసన్న, తహసిల్దార్ శైలజ,నగర అద్యక్షుడు పగడాల నాగరాజు, డివిజన్ నాయకులు దేవభక్తుని కిషోర్ బాబు, ముక్తార్ తదితరులు ఉన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube