పేదలకు ఇండ్లు ఇండ్ల స్థలాలు ఇవ్వాలి

పేదలకు ఇండ్లు ఇండ్ల స్థలాలు ఇవ్వాలి

0
TMedia (Telugu News) :

పేదలకు ఇండ్లు ఇండ్ల స్థలాలు ఇవ్వాలి

 

వనపర్తి పట్టణంలో నిరుపేదలకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలని తెలంగాణ ప్రజాసంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో గురువారం పట్టణంలోని కర్రెమ్మ గుడి సెంటర్ దగ్గర ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా సిఐటీయు జిల్లా సహాయ కార్యదర్శి గోపాలకృష్ణ మాట్లాడుతూ 2008 భూ పోరాటంలో భాగంగా పేదలకు అప్పటి ప్రభుత్వం 685 మందికి అప్పాయిపల్లి శివారు సర్వేనెంబర్ 974 మబ్బుగుట్ట పీర్లగుట్ట సర్వేనెంబర్ 143,145 లలో ఇండ్ల పట్టాలు ఇవ్వడం జరిగిందని కానీ పట్టాలు ఇచ్చిన వారికి స్థలాలు చూపలేదని అదేవిధంగా కనీస సౌకర్యాలు కల్పించలేక పోవడంతో పేదలు ఇండ్లు నిర్మించుకోలేదన్నారు.ఇప్పుడు పీర్లగుట్ట మబ్బుగుట్టలలో స్థలాలు అన్యాక్రాంతం అయ్యాయని. అపాయిపల్లి శివారులో డబల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మాణం చేస్తున్నారని దీంతో పట్టాలు ఇచ్చిన నిరుపేదలు వీధిన పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.

ALSO REAd :పోలవరం పై రాహుల్ గాంధీతో చర్చించిన కాంగ్రెస్ నాయకులు

పట్టాలి ఇచ్చిన పేదలందరికీ ఇండ్ల స్థలాలు చూపి ఇంటి నిర్మాణం కోసం ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని.పట్టణంలో ఇండ్లు,ఇండ్ల స్థలాలు లేని నిరుపేదలు చాలామంది ఉన్నారని వారికి కూడా ఇండ్ల స్థలాలు డబల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. లేనియెడల దశలవారీగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటీయు నాయకులు డి కురుమయ్య, మదన్,రాబర్ట్, బాలరాజు,మన్యం,దేవరాజు,శేషన్న, గట్టయ్య, కురుమయ్య,శ్రీను, రాజు,బంకలి కురుమయ్య తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube