మాదిగ జర్నలిస్టులందరికీ ఇండ్లు స్థలాలు మంజూరు చేయాలి

మాదిగ జర్నలిస్టులందరికీ ఇండ్లు స్థలాలు మంజూరు చేయాలి

0
TMedia (Telugu News) :

మాదిగ జర్నలిస్టులందరికీ ఇండ్లు స్థలాలు మంజూరు చేయాలి

టీ మీడియా, ఫిబ్రవరి 14, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ని తెలంగాణ మాదిగ జర్నలిస్టు ఫోరం రాష్ట్ర అధ్యక్షులు నాగేందర్ రాష్ట్ర నాయకత్వం మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి వినతిని అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు కలిపి 2500 మంది వరకు మాదిగ మాదిగ ఉప కులాలకు చెందిన ఫ్రంట్ అండ్ ఎలక్ట్రానిక్ (పెద్ద చిన్న పత్రికలు యూట్యూబ్ ఛానల్) మీడియాలో రాష్ట్ర జిల్లా నియోజకవర్గ మండల స్థాయిలో పనిచేస్తున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు ఇంటి స్థలము లేదా డబల్ బెడ్రూం ఇల్లు మంజూరు చేస్తామని ప్రకటించింది. ప్రభుత్వం ప్రకటనను మా తెలంగాణ మాదిగ జర్నలిస్టు ఫోరం తరుపున ఆహ్వానిస్తూ హర్షిస్తున్నాం. ఇప్పటికే సామాజికంగా ఆర్థికంగా వెనుకబడి ఉన్న మాదిగ జర్నలిస్టులకు(సీనియార్టీ అక్రిడిటేషన్ కార్డు శాలరీ పే స్లిప్) నిబంధనలు లేకుండా ప్రతి ఒక్క మాదిగ జర్నలిస్టులకు ఇంటి స్థలం లేదా డబల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరుచున్నాము.

Also Read : శక్తి కేంద్ర కార్నర్ సమావేశం

ప్రెస్ అకాడమీ చైర్మన్ గా మా పరిస్థితులు స్థితిగతులు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు దృష్టికి తీసుకువెళ్లి ఇండ్ల స్థలాలు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు పని చేసే ప్రాంతంలోనే మంజూరు మంజూరు చేయగలరని విజ్ఞప్తి చేశారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube