సాగుకు ఎరువుల సాయమెంత‌?

రాష్ట్రాల‌కు ఫ‌ర్టిలైజ‌ర్స్ స‌ర‌ఫ‌రాపై కేంద్రాన్ని ఎంపీ నామ నిల‌దీత‌

2
TMedia (Telugu News) :

సాగుకు ఎరువుల సాయమెంత‌?

రాష్ట్రాల‌కు ఫ‌ర్టిలైజ‌ర్స్ స‌ర‌ఫ‌రాపై కేంద్రాన్ని ఎంపీ నామ నిల‌దీత‌

టి మీడియా, జూలై23,ఢిల్లీ   : ఖరీఫ్ సీజన్లో ఎరువుల కొరత లేకుండా రైతులను ఆదుకునేందుకు యూరియా కేటాయింపులకు సంబంధించి రాష్ట్రాల నుంచి వచ్చిన అధ్యర్ధనలు , ప్రతిపాదనలపై కేంద్ర ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకుందో వెల్లడించాలని టీఆర్ఎఎస్ లోక్ సభా పక్ష నేత , ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని నిఖితపూర్వకంగా ప్రశ్నించారు . ఖరీఫ్ లో రైతాంగానికి ఎరువులు కొరత లేకుండా చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని , ఈ సమస్యను అధిగమించేందుకు కేంద్రానికి కేటాయింపులు గురించి అభ్యర్ధనలు పంపడం జరిగిందని , వాటికి సంబంధించిన వివరాలు వెల్లడించాలని నామ కేంద్రాన్ని కోరారు . అలాగే రబీ సీజను లో ఇంకా ఎరువుల నరఫరాకు సంబంధించి బ్యాలన్స్ చేయాల్సి ఉందా ? ఉంటే అందుకు తీసుకున్న చర్యలు ఏమిటో కూడా తెలియజేయాలన్నారు . నామ ప్రశ్నపై కేంద్ర రసాయనాలు , ఎరువుల శాఖా మంత్రి భగవంత్ సమాధానం ఇస్తూ ప్రభుత్వం ప్రతి వ్యవసాయ సీజన్లో సమయానుకూలంగా రైతులకు కావాల్సిన ఎరువులు సరఫరా గురించి సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలతోను , అధికారులతో సమావేశం కావడం జరుగుతుందన్నారు . తదనుగుణంగా వారిచ్చే వివరాలు ఆధారంగా ఆయా రాష్ట్రాలకు కావాల్సిన ఇండింట్ ఆధారంగా ఎరువుల సరఫరా చేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు . ప్రతి సీజన్లో పంట ప్రారంభానికి ముందే ఎరువులు సరఫరాకు సంబంధించి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపి కావాల్సిన ఎరువులను అందుబాటులో ఉంచడం జరుగుతుందన్నారు .

 

Also Read : బోయినపల్లి పుట్టినరోజు వేడుకలు

 

లభ్యతను అనుసరించి కేటాయింపులు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి పేర్కొన్నారు . ఎరువుల శాఖ ఇచ్చిన ప్రణాళిక ఆధారంగా రాష్ట్రాలకు ఎరువుల లభ్యతకు అనుగుణంగా సబ్సిడీపై ఎరువులు సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు . ఇంటిగ్రేటెడ్ ఫెర్టిలైజర్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా ఎరువుల సరఫరా పద్దతిని ఆన్లైన్లో పర్యవేక్షించడం జరుగుతుందన్నారు . మార్కెఫెడ్ వంటి రాష్ట్రాల సంస్థాగత ఏజెన్సీల ద్వారా ఎరువులు సరఫరాను క్రమబద్ధీకరించడం జరుగుతుందన్నారు . రైల్వే రేక్ ల ద్వారా ఎరువుల సరఫరాను క్రమబద్ధీకరించేందుకు ఎరువుల తయారీదారులు దిగుమతిదారులను సమస్యయం చేసుకుంటూ ముందుకుపోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించడం జరిగిందన్నారు . రాష్ట్ర ప్రభుత్వాలు సూచించిన విధంగా ఎరువులను సరఫరా చేసేలా చర్యలు తీ సుకుంటున్నట్లు వివరించారు . యూరియా ఇతర ఎరువులకు సంబంధించి డిమాండ్ ఉత్పత్తి మధ్య అంతరాన్ని దిగుమతుల ద్వారా తీర్చడం జరుగుతుందన్నారు . 2022 ఖరీఫ్ సీజన్లో దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత రాష్ట్రాల నుంచి 179.01 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువుల అవసరం ఉందని నిర్ధారించడం జరిగిందని మంత్రి తెలిపారు . తెలంగాణకు 10.50 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం ఉందని చెప్పారు . పంజాబుకు 1430 లక్షల మెట్రిక్ టన్నులు, ఉత్తర ప్రదేశ్ 38.50 , గుజరాత్ 11.50 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం ఉందని కేంద్ర మంత్రి రాష్ట్రాల గురించిన సమాచారాన్ని తెలిపారు .

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube