సరైన ఫ్రెండ్‌ను కనిపెట్టడం ఎలాగంటే..

సరైన ఫ్రెండ్‌ను కనిపెట్టడం ఎలాగంటే..

0
TMedia (Telugu News) :

సరైన ఫ్రెండ్‌ను కనిపెట్టడం ఎలాగంటే..

లహరి, జనవరి 27, కల్చరల్ : ప్రతి అంశాన్ని చాలా చక్కగా వివరించిన గొప్ప మేధావి.చాణక్య. ఆయన చెప్పిన ఎన్నో విషయాలు నిజజీవితంలో పాటించదగినవి. ఆయన ఆలోచనలు కచ్చితంగా ఫలితాన్ని ఇచ్చేవి. చాణక్యుడు రాసిన నీతి పుస్తకం ప్రకారం సరైన స్నేహితుడిని కనిపెట్టడం ఎలాగో ఇప్పుడు చూద్దాం. ప్రతి వ్యక్తికి స్నేహితులు ఉండాలి. అది కూడా నమ్మదగిన, నిజాయితీ గల వారై ఉండాలి. వారిని మనం విశ్వసించగలగాలి, వారితో రహస్యాలు షేర్ చేసుకోగలగాలి. కష్టాల్లో ఉన్నప్పుడు వారు సాయం చేస్తారని అనిపించాలి. అండగా ఉంటారని నమ్మకం ఉండాలి. జ్ఞానం, తెలివి ఉండాలి.

వారు మనకు సలహాలు ఇస్తుండాలి, మార్గదర్శకత్వం చేస్తుండాలి. మన చర్యలపై విమర్శనాత్మకంగా ఉండాలని చాణక్యుడు చెప్పాడు. ఈ తప్పుల వల్ల లక్ష్మీ దేవి ఆగ్రహానికి గురవుతారు, ఆర్థిక సమస్యలు చుట్టుముడతాయి నిజాయితీగా, సూటిగా.. నిజమైన స్నేహితుడు నిజాయితీగా, సూటిగా ఉండాలి. వినడానికి కష్టంగా ఉన్నా నిజం చెప్పడానికి భయపడని వ్యక్తి అయి ఉండాలి. వారు నిర్మాణాత్మక విమర్శలను అందించగల వ్యక్తిగా ఉండాలి. సొంత లోపాలు, బలహీనతలను చూసేందుకు వారు సహాయం చేయాలని చాణక్యుడు చెప్పాడు. ఈ వ్యక్తులను ఎప్పుడూ సాయం అడగొద్దు, మంచి కంటే చెడే ఎక్కువ జరుగుతుంది నమ్మకంగా.. నిజమైన స్నేహితుడు నమ్మకంగా, విశ్వాసపాత్రంగా ఉండాలి. కష్టనష్టాల్లో, సుఖదుఃఖాల్లో తోడుగా ఉండాలి. మద్దతునివ్వాలి. అవసరమైన సమయంలో వారు పక్కనే ఉండాలి. మీకు సహాయం చేయాలి, త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉండాలని చాణక్యుడు చెప్పాడు. చాణక్య నీతి ప్రకారం ఈ 5 అంశాలు ప్రాణాలు తీస్తాయి, వాటితో జాగ్రత్త అవసరం నిస్వార్థంగా.. నిజమైన స్నేహితుడు నిస్వార్థంగా ఉండాలి. దయతో ప్రవర్తించాలి. వారు మన అవసరాలను వారి సొంత అవసరాలకు ముందు ఉంచగలిగే వ్యక్తిగా ఉండాలి. కష్ట సమయాల్లో ఉన్నప్పుడు సానుభూతి చూపాలి. వారు ప్రోత్సాహం, మద్దతును అందించే వ్యక్తిగా ఉండాలి. నిరాశకు గురైనప్పుడు ఉత్సాహం వచ్చేలా ప్రయత్నించే వ్యక్తి అయి ఉండాలని చాణక్యుడు చెప్పాడు. చాణక్య నీతి ప్రకారం ఈ రహస్యాలను ఎవరితో షేర్ చేసుకోవద్దు, అవేంటంటే.. ఫ్యామిలీ ఫ్రెండ్‌లా.. ప్రతి ఒక్కరికీ ఫ్యామిలీ ఫ్రెండ్‌ ఉంటారు. అయితే ఫ్యామిలీ ఫ్రెండ్ ను ఎన్నుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. స్కూల్లో, కాలేజీలో, వర్క్‌ప్లేస్‌లో స్నేహితులు కనిపిస్తారు. కానీ ఫ్యామిలీ ఫ్రెండ్స్‌గా ఉండేవారు చాలా తకువ. ఈ ఫ్యామిలీ ఫ్రెండ్స్‌ను ఎంపికి చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని చాణక్యుడు చెప్పాడు. ముఖ్యంగా చెడు కార్యకలాపాలకు పాల్పడే వారిని, చెడు అభిరుచులు ఉన్న వారికి దూరంగా ఉండాలి. వారు నాశనం చేయబడడమే కాకుండా వారి సహవాసం ద్వారా మనం కూడా నాశనం అవుతాం.

Also Read : గాల్‌బ్లాడర్‌లో రాళ్లు ఏర్పడకుండా ఈ జాగ్రత్తలు

కాబట్టి అలాంటి వారికి దూరంగా ఉండాలి.ఈ 7 విషయాలు గుర్తుంచుకోకపోతే ధనవంతుడు కూడా పేదవాడు అవుతాడు ఎదురుగా ఒకలా, వెనక మరోలా.. నిజమైన స్నేహితుడు ఎప్పుడైనా ఒకేలా ఉంటాడు. మీ గురించి వేరే వారి వద్ద తక్కువ చేసి మాట్లాడడు. మీరు ముందు ఉన్నప్పుడు ఒకలా, వెనక ఉన్నప్పుడు మరోలా ఉండరు. వారు ఎప్పుడైనా, ఎక్కడైనా ఒకేలా ఉంటారు. అలాంటి వారిని స్నేహితులుగా చేసుకోవాలని చాణక్యుడు చెప్పాడు. చాణక్య నీతి ప్రకారం నిజమైన స్నేహితుడు నమ్మదగినవాడు, తెలివైనవాడు, నిజాయితీపరుడు, విశ్వాసపాత్రుడిగా నిస్వార్థంగా ఉండాలి. వారు విలువైన సలహాలు మరియు మార్గదర్శకత్వం అందించగల వ్యక్తిగా ఉండాలి. కష్ట సమయాల్లో ఉన్నప్పుడు సానుభూతి చూపాలి. ఈ లక్షణాలను దృష్టిలో ఉంచుకోవడం ద్వారా జీవిత ప్రయాణంలో మీకు మద్దతునిచ్చే, మార్గనిర్దేశం చేసే సరైన స్నేహితుడిని గుర్తించవచ్చని చాణక్యుడు చెప్పాడు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube