మానవత్వం ప్రదర్శించిన పోలీసులు

మానవత్వం ప్రదర్శించిన పోలీసులు

1
TMedia (Telugu News) :

మానవత్వం ప్రదర్శించిన పోలీసులు

టీ మీడియా ,మార్చి 22, ప్రకాశం: కిలోమీటర్ల దూరం తమ భుజాలపై బయటకు తీసుకువచ్చి మానవత్వం ప్రదర్శించిన ప్రకాశం జిల్లా పోలీసులు.ప్రకాశం జిల్లా, హెచ్ఎం పాడు మండలం పరిధిలోని హాజీపురం ఫారెస్ట్ ఏరియాలో 1.5 కిలోమీటర్ల దూరంలో నీ దట్టమైన అడవి ప్రాంతంలో సుమారు 62-65 మధ్య వయస్సు గల గుర్తు తెలియని వ్యక్తీ చనిపోయి ఉన్నట్లు గమనించిన గ్రామస్తులు సదరు సమాచారాన్ని వెంటనే హెచ్ఎం పాడు ఎస్సై గారికి తెలియజేశారు. సమాచారం అందుకున్న కనిగిరి సిఐ పాపారావు గారు, హెచ్ఎం పాడు ఎస్సై కృష్ణ పావని గారు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసి అతని తాలూకు బంధువులు ఎవరైనా ఉన్నారని వెరిఫై చేసినారు. ఎవరూ ముందుకు రాకపోవడంతో పోలీస్ వారు ఆ మృతదేహాన్ని హాజీపురం ఫారెస్ట్ ఏరియా నుంచి సుమారు 1.5 కిలోమీటర్ల దూరం తమ భుజాలపై మోసుకుంటూ కనిగిరి ఆస్పత్రిలో పోస్టుమార్టం నిమిత్తం తీసుకురావడం జరిగింది. అనంతరం అంత్యక్రియలు కూడా నిర్వహించటం జరిగింది. విధుల్లో మానవత్వం చాటుకున్న కనిగిరి సిఐ పాపారావు, హెచ్ఎం పాడు ఎస్సై కృష్ణ పావని, కానిస్టేబుల్ బ్రహ్మయ్య, ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.

Also Read : ప్రశాంతంగా బోధన్ పట్టణం..

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube