గుడిసెలు వేసుకొన్న పేదలకు పట్టాలు ఇవ్వాలి
ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలి.
-తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం.
టీ మీడియా,ఏప్రియల్ 17,పాల్వంచ :ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్న పేదలందరికీ ఇంటి స్థలంకు పట్టాలు,ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్రి ప్రసాద్,మచ్చ వెంకటేశ్వర్లు, అన్నవరపు కనకయ్య లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, సోమవారం నాడు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకొని నివసిస్తున్న వందలాది మంది పేదలతో కేఎస్ఎం బంక్ నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు, అనంతరం కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు, ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్ అద్యక్షతన జరిగిన సభలో వారు పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 58,59 ప్రకారం ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకొని జీవిస్తున్న పేదలకు ఇంటి స్థలానికి పట్టాలు ఇస్తామని ప్రకటించింది, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అమలు జరిపి పేదలకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.
AlsoRead:కంటి చూపు బాగుంటే ఏ పనైనా చేసుకోగలం : మంత్రి పువ్వాడ
ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు,గత అనేక సంవత్సరాలుగా పేదలు ఎండకు ఎండి, వానలకు తడిసి, చలిలో కూడా,విష పురుగుల మద్య జీవనం సాగిస్తున్నారు, మంచినీరు, కరెంట్ లేకపోయినా ఇంటి స్థలం కోసం అనేక బాధలు పడుతున్నారని అన్నారు, జిల్లా కేంద్రంలో వివిధ రకాల కూలి పనుల కోసం అనేక మండలాల నుంచి వచ్చిన పేదలు ఇంటి కిరాయిలు కట్టలేక అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు, చుంచుపల్లి మండలం లో సర్వే నెంబర్ 137/1 ప్రభుత్వ భూమి 20ఎకరాలలో 500 గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నారని, ఇల్లందు మండలం బాలాజీ నగర్ లో సర్వే నెంబర్ 506 లో 30 గుడిసెలు,సీఎస్పి బస్తీ లో సర్వే నెంబర్ 627లో200 గుడిసెలు , సుజాత నగర్ మండలం లో పాతఅంజనాపురం గ్రామంలో 200 గుడిసెలు,రాఘవాపురం గ్రామంలో 40 గుడిసెలు, కాసాని లక్ష్మి నగర్ లో 40గుడిసెలు , పాల్వంచ మండలం లో సర్వే నెంబర్ 444 పాలకోయతండ లో, ప్రియదర్శిని కాలనీల్లో 130 కుటుంబాలు నివసిస్తున్నారని తెలిపారు, వీరందరికీ వెంటనే పట్టాలివ్వాలని డిమాండ్ చేశారు, లేకపోతే సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని తెలిపారు, అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు కు వినతపత్రం , వ్యక్తి గత దరఖాస్తులు ఇచ్చారు.ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కమిటీ సభ్యురాలు శెట్టి వినోద, జిల్లా ఉపాధ్యక్షులు ఆలేటి కిరణ్, జిల్లా నాయకులు దొడ్డ రవికుమార్, భూక్యా రమేష్,సందకూరి లక్ష్మి, గండమాల భాస్కర్,సోలం నాగరత్నం,కోటా బాలక్రిష్ణ,జబ్బ సంధ్యారాణి,భారతమ్మ,ప్రేమ్ కుమార్, సిద్దెల రాములు,లలిత తదితరులు పాల్గొన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube