హైదరాబాద్‌ పర్యటనలో అమిత్‌షా షెడ్యూల్ విడుదల

హైదరాబాద్‌ పర్యటనలో అమిత్‌షా షెడ్యూల్ విడుదల

0
TMedia (Telugu News) :

హైదరాబాద్‌ పర్యటనలో అమిత్‌షా షెడ్యూల్ విడుదల

 

టీ మీడియా, ఏప్రిల్ 21, హైదరాబాద్‌ : కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా హైదరాబాద్‌ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఆదివారం సాయంత్రం ప్రత్యేక విమానంలో ఆయన శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకుంటారు. 3.50కి శంషాబాద్‌ నోవాటెల్‌కి చేరుకొని.. సాయంత్రం 4 గంటల నుంచి 4.30 వరకు ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా ఆస్కార్‌ విజేతలతో తేనీటి విందులో పాల్గొననున్నారు. 5.15కి అక్కడి నుంచి బయల్దేరి రోడ్డు మార్గం ద్వారా చేవెళ్లకు వెళ్లనున్నారు. 6గంటలకు హైదరాబాద్‌ శివారులోని చేవెళ్ల చేరుకొని పార్లమెంటరీ ప్రవాస్‌ యోజన సమావేశంలో అమిత్‌ షా పాల్గొననున్నారు. ఈ తరుణంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడంతో పాటు పార్టీలో కీలక నేతల చేరికలపై రాష్ట్ర నాయకులు కసరత్తు చేస్తున్నారు. అమిత్‌షా కర్ణాటకలో ఎన్నికల ప్రచారం ముగించుకున్న అనంతరం ఇక్కడికి రానుండటంతో ఆ రాష్ట్ర సరిహద్దుకు దగ్గరగా ఉన్న చేవెళ్ల బహిరంగ సభ ఏర్పాటుకు అనువుగా ఉంటుందని నేతలు నిర్ణయించారు. అక్కడ పెద్దఎత్తున బహిరంగ సభ నిర్వహించేలా కార్యక్రమం ఖరారైంది.

 

AlsoRead:బ్రిట‌న్ డిప్యూటీ ప్ర‌ధాని రాజీనామా

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube