చావనైనా చస్తాగానీ బీజేపీతో మళ్లీ పొత్తు పెట్టుకోను

- బీహార్‌ సీఎం

0
TMedia (Telugu News) :

చావనైనా చస్తాగానీ బీజేపీతో మళ్లీ పొత్తు పెట్టుకోను

– బీహార్‌ సీఎం

టీ మీడియా, జనవరి 30, పాట్నా: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను చావనైనా చస్తానుగానీ బీజేపీతో మరోసారి పొత్తు పెట్టుకోనని తెగేసి చెప్పారు. బీహార్‌లో మహా కూటమి ప్రభుత్వాన్ని దెబ్బతీసేందుకు బీజేపీ చేయని కుట్ర లేదని ఆయన ఆరోపించారు. ఆర్జేడీ అగ్రనేత, బీహార్‌ ఉపముఖ్యమంత్రి తేజస్వియాదవ్‌పైన, ఆయన తండ్రి లాలూప్రసాద్‌ యాదవ్‌పైన బీజేపీ తప్పుడు కేసులు బనాయించి వేధిస్తున్నదని విమర్శించారు. తేజస్విపై, లాలూపై బీజేపీ మోపిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని చెప్పారు. ఆర్జేడీని నేతలను వేధించడం ద్వారా కూటమిని విడదీస్తే తాను తిరిగి వాళ్ల దారికి వెళ్తానని బీజేపీ నేతలు భావిస్తున్నారని ఆరోపించారు. నితీశ్‌ కుమార్‌కు మరో గత్యంతరం లేదని, వచ్చే ఎన్నికల్లో తిరిగి తమతో పొత్తు పెట్టుకుంటారని బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను మీడియా ప్రస్తావించగా నితీశ్‌ పైవిధంగా స్పందించారు.ప్రజాధరణ కోల్పోయిన నితీశ్‌కుమార్‌ మళ్లీ బీజేపీతో దోస్తీకి ప్రయత్నిస్తారని, అయితే నమ్మద్రోహి అయిన నితీశ్‌ చేతిలో మరోసారి మోసపోయేందుకు తాము సిద్ధంగా లేమని బీహార్ బీజేపీ అధ్యక్షుడు సంజయ్‌ జైస్వాల్‌ వ్యాఖ్యానించారు.

Also Read : బస్సులు ఢీ.. పలువురు విద్యార్థులకు గాయాలు

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీహార్లో బీజేపీ మొత్తం 40 స్థానాలకుగాను 36 స్థానాల్లో గెలుస్తుందని చెప్పారు. అయితే, లోక్‌సభ ఎన్నికల్లో 36 స్థానాలు గెలుస్తామన్న బీజేపీ నేతల వ్యాఖ్యలపై కూడా నితీశ్‌ స్పందించారు. జేడీయూతో పొత్తు ఉన్నప్పుడు బీజేపీ ఐడియాలజీని తీవ్రంగా వ్యతిరేకించే ముస్లిం సమాజం కూడా వారికి ఓట్లు వేసిందని, ఈసారి అలా జరగదని చెప్పారు. బీజేపీ అలాంటి ఆశలు పెట్టుకుంటే అడియాశలే అవుతాయని ఎద్దేవా నితీశ్‌కుమార్‌ చేశారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube