హాట్‌ సమ్మర్‌లో ఐస్‌ యాపిల్స్‌

వేసవిలో తాటి ముంజలు దివ్యౌషధం

1
TMedia (Telugu News) :

హాట్‌ సమ్మర్‌లో ఐస్‌ యాపిల్స్‌

వేసవిలో తాటి ముంజలు దివ్యౌషధం

టీ మీడియా ,మే 8,హైదరాబాద్‌: చూడటానికి జెల్లీలా, పట్టుకుంటే జారిపోయేంత మృదువుగా, నోట్లో వేసుకుంటే కరిగిపోయే తాటి ముంజలు అంటే చిన్న, పెద్ద తేడా లేకుండా అందరి నోళ్లలో నీళ్లూరుతాయి. ప్రత్యేకించి వేసవిలో లభించే పండ్లలో ముంజలు ఎంతో ప్రత్యేకతను సంతరించుకున్నాయి. తాటి ముంజల్లో అధిక శాతం నీరు ఉంటుంది. శరీరానికి కలిగించే చలువ వల్ల దీనిని ఐస్‌ యాపిల్‌ అనికూడా అంటారు. ఎండాకాలం ప్రారంభం కాగానే తాటిముంజలు మార్కెట్‌లోకి వస్తుంటాయి. ఒకప్పుడు పల్లెల్లో పుష్కలంగా దొరికే తాటిముంజలు ప్రస్తుతం పట్టణాల్లో రోడ్ల వెంట కుప్పలు, కుప్పలుగా పోసి అమ్ముతున్నారు. లేతవి రూ.5కు ఒకటి, ముదిరినవి రూ.5కు రెండు చొప్పున విక్రయిస్తున్నారు.

 

Also Read : భారీగా పట్టుబడిన గంజాయి

పొట్టు తీయకుండా తినాలి…
చాలామంది ముంజలపై పొట్టు తీసి తింటుంటారు. కానీ ఆ పొట్టులో ఎన్నో రకాల పోషకాలుంటాయి. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి అవి చాలా అవసరం అలాగే ఈ పొట్టు ఎంతో చలువ చేస్తుంది. కాబట్టి తాటి ముంజల్ని పొట్టు తీయకుండా తింటేనే ఆరోగ్యానికి మంచిది.

బరువునూ తగ్గిస్తాయి..
తాటిముంజల్లో శరీరానికి కావల్సిన ఏ, బీ, సీ విటమిన్లు, ఐరన్‌, జింక్‌, పాస్ఫరస్‌, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. వీటిలో అధిక మొత్తంలో నీరు ఉండటం వల్ల శరీర బరువును తగి్ంగచడంలో ఇవి ఎంతగానో తోడ్పడుతాయి. అలాగే చికెన్‌పాక్స్‌తో బాధపడే వారికి దురద నుంచి ఉపశమనం అందించి శరీరాన్ని చల్లబరుస్తాయి.

ఎన్నో పోషక విలువలు, విటమిన్లు
డీహైడ్రేషన్‌ నుంచి ఉపశమనం..
ఎండాకాలంలో ఎన్ని నీళ్లు తాగినా ఆవిరైపోయి గొంతు తడారిపోతుంది. ముంజల్లో నీటి శాతం అధికంగా ఉండటం వల్ల వీటిని తీసుకుంటే ఆసమస్య నుంచి మనల్ని కాపాడుకోవచ్చు. వేసవిలో శరీరానికి కావల్సిన మినరల్స్‌, చక్కెరను ఇవి సమతుల్యం చేస్తాయి. అధిక మొత్తంలో విటమిన్‌ డి, న్‌, క్యాల్షియం, ఉంటాయి. రుచి లేత కొబ్బరిలా ఉంటుంది.

డీ హైడ్రేషన్‌, దీర్ఘకాలిక వ్యాధులకు ఉపశమనం
ముంజల్లో తక్కువ మొత్తంలో క్యాలరీలు, ఎక్కువ మొత్తంలో శరీరానికి అవసరమైన శక్తి ఉంటుంది. చలువ కోసం వీటిని తింటారు. కొంత మందికి ఎండాకాలంలో వేడి కారణంగా ముఖంపై చిన్న చిన్న మొటిమలు వస్తూ ఉంటాయి. వాటి నుంచి ఉపశమనం పొందటం కోసం ముంజలు తింటారు.

 

Also Read : సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు

క్యాన్సర్ల నుంచి…
తాటిముంజలు వివిధ రకాల ట్యూమర్స్‌, బ్రెస్ట్‌క్యాన్సర్‌ కణాలను అభివృద్ధి చేసే ఫైటో కెమికల్స్‌, ఆంథతోసయనిన్‌లాంటి వాటిని నిర్మూలిస్తాయి. ఈ పండు తినటం వల్ల క్యాన్సర్ల నుంచి దూరంగా ఉండవచ్చు. శరీరానికి కావల్సిన మినరల్స్‌, న్యూట్రియంట్ల శాతాన్ని బ్యాలెన్స్‌ చేయడంలో ముంజలు కీలక పాత్ర వహిస్తాయి.

వాంతులయ్యేలా ఉంటే…
అధిక ఎండ వేడిమికి కొంత మందికి ఒక్కోసారి వాంతులయ్యేట్లు అనిపిస్తుంది. ఇలాంటప్పుడు నిమ్మరసం తీసుకుంటారు. ఒకవేళ నిమ్మరసంతో మార్పు లేకుంటే ముంజలు తినడం చాలా మంచిది. వెంటనే ఆ పరిస్థితి నుంచి ఉపశమనం పొందవచ్చు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube