సేవ చేయడం ప్రభుత్వ విప్ రేగా కాంతారావు నాకు ఆదర్శం:

0
TMedia (Telugu News) :

టీ మీడియా,నవంబర్23,కరకగూడెం:

సేవ దృక్పథంలో గుడ్ల రంజిత్ కుమార్ మరో మారు భేష్ అనిపించుకున్నారు.
క్షతగాత్రున్ని తన ఆటోలో సకాలంలో ప్రభుత్వ ఆసుపత్రికి చేర్పించి మానవత్వం చాటుకున్నారు.
ఏజన్సీ కరకగూడెం మండలంలోని మొగిళితోగు గ్రామానికి చెందిన కోడెం బొత్తయ్య అనే వ్యక్తి భట్టుపల్లి గ్రామం వద్ద ప్రమాదవశాత్తు   ప్రమాదానికి గురైనాడు.అదే సమయంలో ఈ.బయ్యారం నుండి  కరకగూడెం వైపు వెళ్తుతున్న టీఆర్ఎస్ పార్టీ యూత్ ప్రెసిడెంట్ గుడ్ల రంజిత్ కుమార్ మానవ దృక్పథంతో స్పందించి తన ఆటోలో ప్రమాదానికి గురైన బొత్తయ్యను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి,దగ్గర ఉండి వైద్య అందించి మానవత్వం చాటుకున్నారు.

Ideal for serving as a government

ఈ సందర్భంగా టీ మీడియా గుడ్ల రంజిత్ కుమర్ ని పలకరించగా ఆపదలో ఉన్నవారిని మానవ దృక్పథంతో ఆలోచించి సహాయం చేయాలని,ఎప్పటికీ ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని అండగా నిలుస్తున్నాని తెలిపారు. అందుకు నాకు సేవ కార్యక్రమాల్లో విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లడం జరుగుతుందని అన్నారు.

Ideal for serving as a government
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube