మైసూర్ లో అవార్డ్ తీసుకున్న ఆదర్శ గ్రామ సర్పంచ్

0
TMedia (Telugu News) :

టీ మీడియా;
కొడిమ్యాల నవంబర్ 22
కర్ణాటక రాష్టంలోని మైసూర్ లో గ్రామపంచాయతీ సేవల పై జరిగిన జాతీయస్థాయి వర్క్ షాప్ లో తెలంగాణ రాష్టం నుండి నలుగురు ఏంపిక అయ్యారు అందులో మెదక్ జిల్లా పంచాయతీ అధికారి సిహెచ్ తరుణ్ రెడ్డి, మరియు ఇద్దరు పంచాయతీ కార్యదర్శులు కామారెడ్డి జిల్లా లోని బాన్సువాడ మండలం లోని కోనాపూర్ పంచాయతీ కార్యదర్శి జి. భరత్, మరొకరు సిద్దిపేట జిల్లాలోని సిద్దిపేట రూరల్ మండలం ని ఇర్కోడ్ పంచాయతీ కార్యదర్శి జీవన్ రెడ్డి వున్నారు. ఇందులో ముగ్గురు అధికారులు కాగా మరొకరు జగిత్యాల జిల్లా లోని కొడిమ్యాల మండలం
హిమ్మత్ రావు పేట్ ఆదర్శ గ్రామ సర్పంచ్ పునుగోటి కృష్ణారావు ఉన్నారు.గ్రామ సర్పంచ్ కృష్ణారావు గత ముప్పై సంవత్సరాల నుండి గ్రామ అభివృద్ధి కి కృషిచేస్తూ వివిధ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అవార్డు లను అందుకున్నారు ఈ గ్రామం లోని అభివృద్ధి పథకాల వినియోగం పరిశుభ్రత పై గతంలో రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఏర్రబెల్లి దయాకర్ రావు అసెంబ్లీలో కొనియాడారు దీంతో ఈ గ్రామం రాష్ట్ర స్థాయి లో చర్చకు వచ్చింది.

ఈ కృషికి మూలకరణం గ్రామసర్పంచ్ ఐనా పునుగోటి కృష్ణారావు వీరిని పలువురు రాష్ట్ర అధికారులు రాష్ట్ర సర్పంచ్ ల ఫోరమ్ మరియు కొడిమ్యాల మండల ప్రజలు శుభాభివందనాలు తెలియజేశారు.

Award winning ideal village sarpanch in Mysore

కాగా మైసూర్ లో జరిగిన సదస్సు లో చంద్రశేఖర్ కుమార్ (అడిషనల్ సెక్రటరీ గౌట్ అఫ్ ఇండియా ), అలోక్ ప్రేమ్ సాగర్ (జాయింట్ సెక్రటరీ గౌట్ అఫ్ ఇండియా )
శ్రీమతి శిల్పకుమారి కమిషనర్ పంచాయతీరాజ్ కర్ణాటక, శ్రీమతి లక్ష్మి ప్రియా (ఎస్ఐ ఆర్డి కర్ణాటక )
సదస్సు లో పాల్గొన్ని రాష్టం లో జరుగుతున్న పంచాయతీ సేవల పై ప్రశంసించారు కాగా
పంచాయతీ రాజ్ మంత్రి ఏర్రబెల్లి దయాకర్ రావు, పంచాయతీ కమిషనర్ డాక్టర్ శరత్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ , చొప్పదండి శాసనసభ్యులు సుంకే రవిశంకర్ కృష్ణారావు గారిని మరియు అధికారులను శుభాకాంక్షలు తెలియజేశారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube