ఇండోనేషియా రాజకుటుంబంలోపుట్టినఇడ్లీ

ఇండోనేషియాలో కెడ్లీ

0
TMedia (Telugu News) :

ఇండోనేషియా రాజకుటుంబంలోపుట్టిన ఇడ్లీ

-ఇండోనేషియాలో కెడ్లీ

– విదేశాలలో స్ట్రీట్‌ ఫుడ్‌

లహరి, జనవరి 10, ప్రతినిధి : ప్రతిరోజు ఎంతో ఇష్టంగా తినే ఇడ్లీ గురించి మీకు తెలుసా.. దాని చరిత్ర తెలిస్తే ఆశ్చర్యపోతారు. చాలామంది ఇడ్లీ దక్షిణ భారతదేశంలో పుట్టిందని చెబుతారు. కానీ ఇందులో వాస్తవం లేదు. నిజానికి ఇడ్లీని భారతదేశంలోని అన్ని ప్రాంతాల్లో ఎక్కువగా తింటారు. అంతేకాదు విదేశాలలో కూడా తింటారు.వాస్తవానికి ఇడ్లీని స్ట్రీట్‌ ఫుడ్‌గా పరిగణిస్తారు. నిజానికి సౌత్ ఇండియన్ ఫుడ్ అని పిలిచే ఇడ్లీ భారతదేశంలో పుట్టలేదు. ఇడ్లీ ఇండోనేషియాలో పుట్టిందా? ఇడ్లీ 800 మధ్య కాలంలో భారతదేశానికి వచ్చిందని చెబుతున్నారు. భారతీయ ఇడ్లీ ఇండోనేషియా రాజకుటుంబం వంటగది నుంచి ఉద్భవించిందని ఆహార చరిత్రకారులు భావిస్తున్నారు. భారతదేశంలో తయారయ్యే ఇడ్లీ ఇండోనేషియాలో తయారైన కెడ్లీని పోలి ఉంటుంది. దీని ప్రస్తావన 920లో బయటపడింది. ఇడ్లీ అరబ్ నుంచి వచ్చిందా..! వివిధ రాజవంశాలు ఆహార పదార్థాలపై కూడా తమ ఆధిపత్యాన్ని చూపించడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ రకమైన టగ్ ఆఫ్ వార్‌లో ఇడ్లీ కూడా చిక్కుకుంది.

Also Read : మీడియానే ప్రచారం చేస్తోంది.

కర్నాటకలో ప్రచురితమైన కథనం ప్రకారం అరబ్బులు తమతో పాటు ఇడ్లీ తీసుకొచ్చారని అక్కడి చరిత్రకారులు భావిస్తున్నారు. అరబ్ ప్రజలు ఇడ్లీని కొబ్బరి చట్నీతో తినేవారని చెబుతున్నారు. ఇడ్లీ ఎలా తయారు చేయాలి..? మినపప్పును బియ్యంతో కలిపి ఆవిరి ద్వారా ఇడ్లీని తయారుచేస్తారు. అయితే దీని తయారీ విధానం గురించి ఖచ్చితమైన సమాచారం మాత్రం లేదు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube