బిఎస్పీని గెలిపిస్తే ప్ర‌వీణ్ కుమార్ ను ముఖ్య‌మంత్రిని చేస్తాం

- బహుజన్ సమాజ్ పార్టీ చీఫ్ మాయావ‌తి

0
TMedia (Telugu News) :

బిఎస్పీని గెలిపిస్తే ప్ర‌వీణ్ కుమార్ ను ముఖ్య‌మంత్రిని చేస్తాం

– బహుజన్ సమాజ్ పార్టీ చీఫ్ మాయావ‌తి

టీ మీడియా, నవంబర్ 23, పెద్ద‌ప‌ల్లి బ్యూరో : బీఎస్పీ తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రవీణ్ కుమార్ అని బహుజన్ సమాజ్ పార్టీ చీఫ్ మాయావతి పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లాలో జరిగిన బీఎస్పీ బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ, అన్ని సామాజిక వర్గాల వారికి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చిన ఏకైక పార్టీ బీఎస్పీ అని తెలిపారు. మండల్ కమిషన్‌ను ఆపింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని.. బీఆర్ఎస్ పార్టీ దళిత వ్యతిరేక పార్టీ అని విమ‌ర్శించారు. ఆర్‌ఎస్‌ ప్రవీణ్ కుమార్‌పై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసిన బీఆర్ఎస్ పార్టీ ని ఈ ఎన్నిక‌ల‌లో ఓడించాల‌ని పిలుపు ఇచ్చారు. ఉత్తర ప్రదేశ్‌లో బీఎస్పీ అధికారంలో ఉన్నపుడు భూమిలేని నిరుపేదలకు భూమి పంపిణీ చేశామమన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా బీఎస్పీ అధికారంలోకి వచ్చిన తరువాత భూమి లేని నిరుపేదలకు భూమి పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. అన్ని వర్గాలకు న్యాయం జరగాలంటే బీఎస్పీ అధికారంలోకి రావాలన్నారు. 30న జరిగే ఎన్నికల్లో ఏనుగు గుర్తుపై ఓటు వేసి బీఎస్పీని గెలిపించాలని బీఎస్పీ చీఫ్‌ మాయావతి ప్రజలను విజ్ఞప్తి చేశారు.

Also Read : వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా నిధులు విడుదల

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube