పువ్వాడను గెలిపిస్తే ఖమ్మం మరింత అభివృద్ధి
-బీఆర్ఎస్ కు మద్దతుగా నిలిచిన ప్రజలు
– ఎంపీ నామ నాగేశ్వరరావు
టీ మీడియా, నవంబర్ 16, ఖమ్మం బ్యూరో : కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ పదేళ్ళలో ముస్లిం మైనార్టీల అభివృద్ధికి అద్భుతంగా పని చేసిందని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ, ఎంపీ నామ నాగేశ్వరరావు, పార్టీ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు.పువ్వాడ అజయ్ కుమార్ విజయాన్ని కాంక్షిస్తూ గురువారం ఖమ్మం నగరంలో ముఖ్యంగా ముస్లిం మైనార్టీలు అధిక సంఖ్యలో ఉన్న ఖిల్లా ప్రాంతంలో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. ఖిల్లా ఏరియా తో పాటు కమాన్ బజార్, కస్బా బజార్, వైరా రోడ్డు, బీకే బజార్, ముస్తఫా నగర్ తదితర ప్రాంతాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. బైక్ ర్యాలీ హైలెట్ గా నిలిచింది. యువకులు భారీగా ఈ ఎన్నికల ర్యాలీలో పాల్గొని,బీఆర్ఎస్ కు మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా పలు కూడళ్లలో వక్తలు మాట్లాడుతూ జిల్లాలో 10 కి 10 స్థానాలు బీఆర్ఎస్ గెలుచుకుని తీరుతుందని స్పష్టం చేశారు. వచ్చేది బీఆర్ ఎస్ ప్రభుత్వమేనని, మూడోసారి కేసీఆర్ సీఎం కావడం ఖాయమని అన్నారు. ప్రజల మద్దతు బీఆర్ఎస్ కే ఉందన్నారు. ఖమ్మం నగరాన్ని ఎంతో అభివృద్ధి చేసిన పువ్వాడ అజయ్ కుమార్ కు వెన్నుదన్నుగా నిలిచి, అత్యధిక మెజార్టీతో గెలిపిoచి అసెంబ్లీకి పంపిస్తే మరింత అభివృద్ధి చేస్తారని అన్నారు. ఖమ్మాన్ని మరింతగా అద్భుతంగా అభివృద్ధి చేస్తారని అన్నారు.
Also Read : కెసిఆర్ మరోసారి గెలిస్తే.. ఆర్టీసీ ఆస్తులు దోపిడే
ప్రదర్శన జరుగుతున్నంత సేపు ప్రజలు, వ్యాపారులు ఆరు బయటకు వచ్చి, దరహాసంతో బీఆర్ఎస్ కు మద్దతు ప్రకటించడం గమనార్హం. ఈ కార్యక్రమంలో హోం మంత్రి మహమూద్ అలీ, ఎంపీ నామ నాగేశ్వరరావు, అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, మేయర్ నీరజ, పార్టీ పట్టణ అధ్యక్షులు పి. నాగరాజు, ఏఎంసీ చైర్మన్ శ్వేత, కర్నాటి కృష్ణ, మైనార్టీ నాయకులు జహీర్ అలీ, మగ్బుల్, ఖమర్, సౌకత్ అలీ, తాజుద్దీన్, తదితరులు పాల్గొన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube